Breaking News

దేశంలో కరోనా పరిస్థితి అచ్చం యూకేలాగానే.. ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు


దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ అసాధారణంగా ఉంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం వైరస్ తీవ్రత క్రిస్టమస్ నాటికి యూకేలో ఉన్న పరిస్థితిలా ఉందని డాక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోలీ నాటికి దేశంలో కేసులు ఎక్కువయ్యాయని, యూకేలోని పరిస్థితి ఇక్కడా పునరావృతమవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు మ్యుటేషన్‌ వైరస్ కారణమనే ఆధారాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. అయితే, డేటా లేదు అనేది వాస్తవమే అయినా మ్యుటేషన్ జరగడం లేదని భావించరాదని ఆయన అన్నారు. కేసులలో అకస్మాత్తుగా పెరుగుదల నమోదయితే వైరస్ వ్యాప్తి, తీవ్రత ఎక్కువగా ఉందని తార్కికంగా చెప్పవచ్చని రణదీప్ గులేరియా పేరకొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో గులేరియా ముఖ్య సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వేగానికి అడ్డుకట్టవేయాలంటే టీకాను ప్రజలకు వీలైనంత త్వరగా అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రజలకు వ్యాకినేషన్ మరింత వేగంగా అందజేసే వ్యూహాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.. కానీ, ఇదే సమయంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైతే ఎదుర్కొనగలిగే నమ్మకం ఉన్న విధంగా దీన్ని చేయాలి’ అన్నారు. కొవాగ్జిన్, కోవిషీల్డ్ ఉత్పత్తి సంస్థలు పిల్లలకు వ్యాక్సిన్‌పై దృష్టిసారించాలన్నారు. నిజంగా కోవిడ్ నియంత్రణలోకి వచ్చి, పిల్లలు ఎప్పటి మాదిరిగా స్కూల్స్‌కు వెళ్లాలనుకుంటే వారికి టీకా తప్పనిసరి అన్నారు. ప్రతి ఇంటికీ టీకా అనేది ప్రస్తుతం ఎందుకు అందుబాటులో తీసుకురాలేదనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. బహుశా వ్యాక్సినేషన్ దుష్ప్రభావాలు, టీకా తీసుకున్న తర్వాత 30 నిమిషాలు అబ్జర్వేషన్ తదితర అంశాలు కావచ్చని అన్నారు.


By April 01, 2021 at 12:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/aiims-director-on-current-covid-surge-and-new-strain-comparison-to-uk-situation/articleshow/81823172.cms

No comments