Breaking News

జస్టిస్ ఎన్వీ రమణ అనే నేను.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం


భారత 48 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది ప్రముఖులే హాజరుకాగా.. అత్యంత నిరాడంబరంగా ప్రమాణస్వీకారం జరిగింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీకాలం ఏప్రిల్ 23తో ముగియగా.. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీనియర్‌గా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని గత నెలలో కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం.. తర్వాత రాష్ట్రపతి వద్దకు పంపింది. రాష్ట్రపతి ఆమోదం వేయడంతో భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు 16 నెలల పాటు చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయ పీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. గతంలో 1966- 67లో జస్టిస్ కోకో సుబ్బారావు సీజేఐ పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయం పీఠం ఎక్కారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో సాధారణ వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.


By April 24, 2021 at 11:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/president-kovind-administers-oath-of-office-to-48th-chief-justice-of-india-n-v-ramana/articleshow/82227765.cms

No comments