Breaking News

Tuck Jagadish: కోలోకోలన్నకోలో సాంగ్‌తో ఆకట్టుకున్న నాని.. ప్రతి మనిషిలో ధైర్యం నింపిన నాచురల్ స్టార్


'నిన్ను కోరి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న నాని- శివ నిర్వాణ కాంబో మరోసారి '' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుతూనే ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ''కోలోకోలన్నకోలో'' సాంగ్‌ రిలీజ్ చేశారు. 'నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే.. నిన్ను వెంటాడే దిగులే వెలిపోతుందా' అంటూ మోటివేషనల్ వర్డ్స్ ఈ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాయగా తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. అమ్రాన్ మాలిక్, హరిణి ఆలపించారు. కంప్లీట్ ఫ్యామిలీతో ఈ సాంగ్ చిత్రీకరించి ప్రతి మనిషిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎక్కడా వెనక్కి తగ్గొద్దని ఏ విషయంలోనైనా యమ ధైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే అన్నీ సాధ్యమే అని చెప్పారు. కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతూ ఆయన 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'టక్ జగదీష్' పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఏప్రిల్ 23వ తేదీన ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ‌


By March 13, 2021 at 12:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kolo-kolanna-kolo-song-released-from-nanis-tuck-jagadish/articleshow/81480621.cms

No comments