Breaking News

Prabhas: ఆదిపురుష్ ఫ్యామిలీలోకి యంగ్ హీరోయిన్‌.. వెల్‌కమ్ చెబుతూ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్


వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా '' అనే భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ విషయంలో చిత్రయూనిట్ సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయడంతో గత కొన్ని రోజులుగా ఆ హీరోయిన్ ఎవరనే దాని గురించిన చర్చ ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో బాలీవుడ్ హీరోయిన్ జోడీ కట్టబోతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన ఇన్స్‌స్టాలో ప్రభాస్ చేసిన పోస్ట్‌తో అదే నిజం అని కన్ఫర్మ్ అయింది. 'ఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్ అని పరిచయం చేశారు ప్రభాస్‌. ఈ మేరకు 'ఆదిపురుష్' కుటుంబంలోకి స్వాగతం అని పేర్కొంటూ ఆమెతో దిగిన ఫొటో పోస్ట్ చేశారు. దీంతో పాటు ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన లక్ష్మణుడి పాత్రను పోషించే హీరో పేరునూ ప్రభాస్ వెల్లడించారు. ముందునుంచీ అంతా ఊహించినట్లుగానే బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ను లక్ష్మణుడి పాత్ర రోల్ కోసం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా రాముడిగా నటిస్తుండగా, సీతగా కృతి సనన్ నటించబోతోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. మరో ముఖ్యపాత్ర కోసం సీనియర్ హీరోయిన్ కాజోల్‌ని తీసుకున్నారని సమాచారం. భారీ తారాగణం పాలు పంచుకుంటున్న ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానులు సహా దేశ విదేశాల్లోని ఆడియన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


By March 12, 2021 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/official-kriti-sanon-joins-with-adipurush-team/articleshow/81460551.cms

No comments