Breaking News

పుదుచ్చేరి: తమిళసై సంచలన నిర్ణయం.. తొమ్మిదో తరగతి వరకు అంతా పాస్


కరోనా వైరస్ కారణంగా గతేడాది దాదాపు అన్ని రాష్ట్రాలూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించుకుండానే ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది కూడా పరీక్షలను రద్దుచేసినట్లు ఇటీవల ప్రకటించింది. 9, 10, 11వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తాజాగా, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ 9వ తరగతి వరకూ విద్యార్థులకు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వెల్లడించారు. కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో 9వ తరగతి వరకు పరీక్షలను రద్దుచేస్తున్నట్టు తెలిపారు. అయితే, 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలుంటాయని ఎల్జీ తమిళసై వివరించారు. పాఠశాలల పునఃప్రారంభం, పరీక్షల నిర్వహణకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చేసిన ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు. ఒకటి నుంచి తొమ్మిద తరగతుల విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్టు ఈ మేరకు రాజ్‌నివాస్ ఓ ప్రకటనలో తెలిపింది. పుదుచ్చేరి పరిధిలోకి వచ్చే కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని మహే, యానాం విద్యార్థులకు ఇవి వర్తిస్తాయని పేర్కొంది. పాఠశాలలను వారానికి ఐదు రోజులు నిర్వహించాలని, 9వ తరగతి వరకు పాఠశాలలు మార్చి 31 వరకు పనిచేయనున్నట్టు వివరించింది. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. వీటితోపాటు వృద్ధ్యాప్యపు, వితంతు పింఛన్ల కోసం రూ.29.65 కోట్ల విడుదలకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. అలాగే, మహే, యానంలో అంగన్వాడీల నిర్వహణకు రూ.24.35 లక్షల కోట్లు మంజూరు చేశారు.


By March 12, 2021 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lg-tamilisai-soundararajan-approves-1-to-9th-students-all-pass-proposal-in-puducherry/articleshow/81459670.cms

No comments