Breaking News

బ్యాంక్ OTP, ఇతర SMSలు మరో రెండు రోజులు రాకపోవచ్చు.. కారణం ఇదే!


బ్యాంకు లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు మొబైల్ ఫోన్‌కు OTP వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకింగ్ సేవలు, ఇతర అంశాలకు సంబంధించిన OTPలు, SMS‌లు చాలా మందికి స్తంభించిపోయాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా () కొత్త నియమ నిబంధనలు అమలులోకి తీసుకురావడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల దేశవ్యాప్తంగా అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, ఫిషింగ్ కాల్స్ వంటివి పెరుగుతూ ఉండడంతో వాటికి అడ్డుకట్ట వేయడం కోసం కొత్త బ్లాక్ ఛైన్ టెక్నాలజీని అమలు చేయాలని టెలికం కంపెనీలను 2019లో ట్రాయ్ ఆదేశించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దానిని తప్పనిసరి చేయడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొత్త నిబంధనలు అమలు ప్రయత్నంలో భాగంగా టెలికాం కంపెనీల సేవలకు కొంత సమయం పాటు తీవ్ర విఘాతం కలిగింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై వినియోగదారులకు SMSలను పంపే సంస్థలు, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు, ఆధార్ వంటి సేవలు అందించే గవర్నమెంట్ ఏజెన్సీలు కొన్ని మెసేజింగ్ టెంప్లేట్లని తయారుచేసుకోవాలి. అందులో సూచించిన విధంగా మాత్రమే వినియోగదారులకు మెసేస్‌లు పంపించాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తాత్కాలికంగా సేవలకు విఘాతం కలగడంతో బ్యాంకులు అతి ముఖ్యమైన మెసేజ్‌లను పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాయి. రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ లోగా ఏదైనా సర్వీసుకి సంబంధించి SMS మెసేజ్ రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కీలకమైన లావాదేవీలు నిర్వహణకు OTPలు తప్పనిసరి అయినప్పటికీ.. కొత్త నియమాల వల్ల స్పామ్ చాలావరకు తగ్గిపోతుంది. కాబట్టి తాత్కాలికంగా కలిగిన అసౌకర్యాన్ని భరించక తప్పదు. మరోవైపు, కొత్త నిబంధనల రాకతో సోమవారం వివిధ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 40 శాతం మేర బ్యాంకింగ్, ఆర్ధిక, టిక్కెట్ బుకింగ్ తదితర సేవలు నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రం వరకు 40 శాతం మేర నిలిచిపోగా.. ప్రభుత్వ, ప్రయివేట్ రంగ బ్యాంకుల సేవలకు 25 శాతం అంతరాయం ఏర్పడింది.


By March 09, 2021 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/why-you-may-not-be-receiving-important-sms-messages-and-otps/articleshow/81405208.cms

No comments