Breaking News

షెల్టర్ హోంలో వేధింపులు: 39 మంది బాలికల పరార్.. నలుగురు మిస్సింగ్


ప్రభుత్వ వసతిగృహం నుంచి 39 మంది బాలికలు పారిపోవడానికి ప్రయత్నించిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. జలంధర్‌లోని ప్రభుత్వ వసతి గృహం నుంచి పరారైన 39 మందిలో 35 మందిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. నలుగురి ఆచూకీ ఇంకా లభించలేదని పేర్కొన్నారు. వసతి గృహం నుంచి పారిపోవడానికి ప్రయత్నించి విఫలమైన బాలికల్లో 18 ఏళ్లలోపువారే అధికంగా ఉన్నారు. వీరంత ప్రభుత్వ సంరక్షణలోనే ఉన్నారని అధికారులు తెలియజేశారు. ‘చట్ట ప్రకారం మైనర్ తీరిన తర్వాత వారు కోర్టును ఆశ్రయించాలి.. అప్పుడు వెళ్లిపోవడానికి న్యాయస్థానం సమ్మతిస్తుంది. 18 ఏళ్లు నిండిన వారు, విముక్తి పొందాలని కోరుకునే వారు కొందరు ఉన్నారు’ అని జలంధర్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి మనీందర్ సింగ్ బేడీ అన్నారు. తక్షణమే వారి సమస్యను పరిష్కరిస్తామనే హామీతోనే వెనక్కు తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. 18 ఏళ్లు నిండిన తమను షెల్టర్ హోం నుంచి బయటకు వెళ్లిపోవడానికి అనుమతించడం లేదని కొందరు ఆరోపించారు. అయితే, ఇది న్యాయపరమైన అంశంతో ముడిపడి ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే, వీరంతా 18 ఏళ్లు నిండటంతోనే షెల్టర్ హోం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించలేదు, పలు కారణాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ‘ప్రభుత్వ వసతి గృహంలో మొత్తం 81 మంది బాలికలు ఉండగా.. 39 మంది పారిపోయారు.. 35 మంది వెనక్కు వచ్చారు.. మరో నలుగురు ఆచూకీ లభించలేదు.. అయితే, షెల్టర్ హోం సిబ్బంది తమ పట్ల అమానుషంగా ప్రవర్తించినట్టు ఆరోపిస్తున్నారు’జలంధర్ పోలీస్ అధికారి జగ్జీత్ సింగ్ మీడియాతో అన్నారు.


By March 09, 2021 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/39-run-away-from-womens-jalandhar-shelter-home-4-missing-punjab-police/articleshow/81404481.cms

No comments