Breaking News

ఉద్ధృతంగా రైతుల ఆందోళనలు.. హరియాణా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం


సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల గతేడాది నవంబరు 27 నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన సెగలు తాజాగా హరియాణా బీజేపీ-జేజేపీ ప్రభుత్వానికి తగిలాయి. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమయ్యింది. బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టనుంది. సాగు చట్టాల విషయంలో అవిశ్వాస తీర్మానం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, తమ సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకాలేదని జననాయక్ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, అవిశ్వాస తీర్మానం జేజేపీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. రైతుల ఆందోళనకు ఎంత ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారో దీని వల్ల వెల్లడవుతుంది. తమ నియోజకవర్గాల్లో రైతుల బహిష్కరిస్తున్నట్లు జేజేపీ సభ్యులు అంగీకరించారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 10 మంది ఎమ్మెల్యేలున్న జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మరో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇక, ప్రతిపక్ష కాంగ్రెస్‌ బలం 31 కాగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ-జేజేపీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేకపోయినా.. భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘ఇద్దరు స్వతంత్రలు మద్దతు ఉపసంహరించుకున్నారు.. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కూటమిలోని మరి కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు’ అని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా అన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ద్వారా తమ వెంట వచ్చేవారు ఎవరో తేలిపోతుందని పేర్కొన్నారు. అయితే, తమకు పూర్తిస్థాయి మెజార్టీ ఉందని, తమపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. రైతులు, వారి మద్దతుదారులతో అధికారంలోకి వచ్చిన జేజేపీ.. ప్రస్తుతం వారి గోడును పట్టించుకోవడం లేదని మండిపడుతోంది.


By March 10, 2021 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-unrest-over-farm-laws-bjp-faces-no-trust-motion-in-haryana-today/articleshow/81424842.cms

No comments