Breaking News

తీర్పు కాపీలో గందరగోళమైన భాష.. హైకోర్టుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు


ఓ కేసులో ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా హిమాచల్ హైకోర్టు తీర్పు కాపీ గందరగోళంగా ఉందని వ్యాఖ్యానించింది. తీర్పులో ఉన్న భాష అపారమైందని గమనించామని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో ఉన్నట్లుగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పౌరులకు అందుబాటులో, అర్థమయ్యే న్యాయాన్ని నిర్ధారించడానికి కారణమవుతాయని పేర్కొంది. తుది తీర్పు ముగింపునకు దారితీసే ఆలోచన తార్కికం, ప్రక్రియను తెలియజేయడానికి ఉద్దేశించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘తీర్పు కాపీ ఉద్దేశం బార్ కౌన్సిల్ సభ్యులకు మాత్రమే కాకుండా, కేసులో హాజరయ్యేవారికి, ఇతరులకు ఇది ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. కానీ చట్టం ప్రకారం కోర్టులను ఆశ్రయించే పౌరుల సమస్యల పరిష్కారానికి అర్ధం అందించడం అన్నింటికంటే ముఖ్యమని’ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ట్రైబ్యునల్ (సీజీఐటీ) తీర్పును హైకోర్టు ధ్రువీకరించనప్పటికీ ఉత్తర్వులలోని ప్రాథమిక వాస్తవాలను అవగాహన చేసుకుందని వ్యాఖ్యానించింది. ‘కోర్టు రికార్డు నుంచి ముఖ్యంగా సీజీఐటీ ఆదేశాలలో ప్రతివాదిపై తీవ్రమైన దుష్ప్రవర్తన ఆరోపణలు ఉన్నప్పటికీ జోక్యం చేసుకుంది.. ఆర్టికల్ 226 కింద పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది’ అని స్పష్టం చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలను సీజీఐటీ ధ్రువీకరిస్తూ ఆయనను తొలగించింది. గతేడాది నవంబరు 27న హైకోర్టు ఈ ఉత్తర్వులను ధ్రువీకరించింది. ఆయనను దుష్ప్రవర్తన ఆరోపణలు నిరూపితమైనందున ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించింది.


By March 14, 2021 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-slams-himachal-hc-for-its-incomprehensible-judgment/articleshow/81490958.cms

No comments