Breaking News

అంబానీ కేసు: పోలీసులే హత్యచేశారు.. హిరేన్ భార్య సంచలన వ్యాఖ్యలు


అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వాహనం యజమాని మన్‌సుఖ్ హీరేన్ మృతిని హత్యగా అనుమానిస్తున్నారు. సైతం హత్య కేసుగా నమోదుచేసింది. తాజాగా, హిరేన్ భార్య విమ్లా సంచలన ఆరోపణలు చేశారు. తమ వాహనాన్ని సచిన్ వాజే గత నాలుగు నెలలుగా వాడుతున్నారని తెలిపారు. వాజేతో తన భర్తకు పరిచయం ఉందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆరోపణలపై వాజే సంప్రదించడానికి మీడియా ప్రయత్నించగా ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల కోసం ఏటీఎస్ సీనియర్ అధికారులను ఎన్ఐఏ బృందం మంగళవారం కలిసింది. పేలుడు పదార్థాల ఘటనపై విచారణ చేపట్టాలని కేంద్ర హోం శాఖ ఎన్‌ఐఏ ఆదేశించిన విషయం తెలిసిందే. గతేడాది ఎస్‌యూవీని కొన్న తర్వాత వాజేకు ఇచ్చారని, ఫిబ్రవరి 5న ఆ వాహనాన్ని సర్వీసింగ్ కోసం తిరిగి తమ గ్యారేజ్‌కు పంపినట్టు విమ్లా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. థానేలో హిరేన్ ఆటోమొబైల్స్ యాక్సరీస్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. ‘చోరీకి గురైన రోజు ఫిబ్రవరి 17న కారును హిరేన్ తీసుకెళ్లగా స్టీరింగ్ పట్టేయడంతో ఐరోలి-ములంద్ లింగ్ రోడ్డు వద్ద పక్కకు తీసి పార్క్ చేశారు. ఆ సమయంలో కారును దొంగిలించారు.. ఇది జరిగిన వారం తర్వాత అంబానీ అంటిలియా నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పార్క్ చేశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు, మీడియా తనను వేధిస్తున్నారని హిరేన్ మార్చి 2న ముంబయి, థానే పోలీస్ కమిషనర్లు సహా పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినట్టు విమ్లా తెలిపారు. ‘‘మార్చి 4న షోరూమ్ నుంచి తొందరగా ఇంటికి వచ్చిన హిరేన్.. ఘడ్‌బుండేర్ వద్ద ఓ పోలీస్ అధికారిని కలవాలని చెప్పి రాత్రి 8.30 గంటలప్పుడు బయటకు వెళ్లారు. రాత్రి 11.00 గంలకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా రెండు మొబైల్స్ స్విచాఫ్ వచ్చాయి. వాజేకు హిరేన్ సోదరుడు వినోద్ కాల్ చేసి తను పోలీస్ అధికారిని కలవడానికి వెళ్లడాని చెప్పారు.. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు చెప్పకుండా ఎందుకెళ్లాడని వాజే అన్నారని, తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని ఆమె అన్నారు. అంతేకాదు, హిరేన్‌‌కు ఈత వచ్చని, తన భర్త నీటిలో మునిగి చనిపోవడం అసాధ్యమని విమ్లా అన్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మెడలో బంగారు గొలుసు, చేతికి ఉంగరాలు, వాచ్, మొబైల్, ఐదు ఏటీఎం కార్డులు, వాలెట్ తీసుకెళ్లారని, అవన్నీ కనిపించలేదన్నారు.


By March 10, 2021 at 01:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mumbai-businessman-mansukh-hirans-wife-tells-ats-she-suspects-cop-killed-him/articleshow/81426876.cms

No comments