Vijay Deverakonda: లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. రౌడీ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చిన ఛార్మి


రౌడీ స్టార్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు ఛార్మి. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ క్రేజీ కాంబోలో రాబోతున్న అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 'లైగర్' కొత్త పోస్టర్ షేర్ చేసిన ఛార్మి.. 'సెప్టెంబర్ 9వ తేదీ నుంచి మీ దగ్గర్లోని థియేటర్స్‌లో పంచ్ ప్యాక్' అని పేర్కొన్నారు. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ట్విటర్ వేదికగా 'డేట్ సెట్టయింది.. మేము ఇండియా వచ్చేస్తున్నాము' అని ప్రకటించారు. ఇక తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో విజయ్ దేవరకొండ హై వోల్టేజ్ పంచ్ లుక్కుతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా, తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రియాలిటీకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు పూరి జగన్నాథ్. ఈ మేరకు విజయ్ దేవరకొండ బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చేయడంతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
By February 11, 2021 at 09:12AM
No comments