Breaking News

కలెక్షన్ల ‘ఉప్పెన’: మూడు రోజుల్లో ఊడ్చేసిన మెగా మేనల్లుడు.. స్టార్ హీరోల సరసన వైష్ణవ్ తేజ్


మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఒక డెబ్యూ హీరోకి ఈ స్థాయి వసూళ్లు రావడం మామూలు విషయం కాదు. ఈ కలెక్షన్లతో స్టార్ హీరోల సరసన నిలబడ్డాడు వైష్ణవ్ తేజ్. తొలిరోజే రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టి డెబ్యూ చిత్రంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ వసూళ్ల సునామీ తొలి రోజుతో ఆగిపోలేదు. శని, ఆదివారాలు కూడా కొనసాగింది. తొలి మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా రూ.28.29 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్‌ (రూ. 22.5 కోట్లు)ను దాటేసి లాభాలు కూడా అందుకుంది ‘ఉప్పెన’. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 24.97 కోట్లు వసూలు చేసి శభాష్ అనిపిస్తోంది. ఈ కలెక్షన్లు బట్టి చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ అన్న మాట నిజమయ్యేట్టే కనిపిస్తోంది. ఇది రూ.100 కోట్ల సినిమా అని సుకుమార్ అన్నారు. రూ.100 కాకపోతే కనీసం రూ.90 కోట్లు అయినా వసూలు చేస్తుందన్నారు. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రాల్లో ‘ఉప్పెన’ కూడా చేరింది. అంటే తొలి సినిమాతోనే చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన వైష్ణవ్ తేజ్ చేరారు. మూడో రోజు ‘ఉప్పెన’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.26 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ‘మహర్షి’, ‘ఖైదీ నంబర్ 150’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అరవింద సమేత’ సినిమాలు వసూలు చేసిన షేర్ కన్నా ‘ఉప్పెన’ షేర్ అధికం కావడం గమనార్హం. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ షేర్ వివరాలు నైజాం - రూ. 8.53 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 4.12 కోట్లు సీడెడ్ - రూ. 3.7 కోట్లు తూర్పు గోదావరి - రూ. 2.36 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 1.53 కోట్లు కృష్ణా - రూ. 1.76 కోట్లు గుంటూరు - రూ. 2.07 కోట్లు నెల్లూరు - రూ. 86.4 లక్షలు ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 24.97 కోట్లు ఓవర్సీస్ - రూ. 1.2 కోట్లు కర్ణాటక - రూ. 1.31 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 33 లక్షలు మొత్తం: రూ. 28.29 కోట్లు మూడో రోజు ఏపీ, తెలంగాణలో అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాలు (నాన్ బాహుబలి) అల వైకుంఠపురములో - రూ. 11.21 కోట్లు సాహో - రూ. 11.16 కోట్లు రంగస్థలం - రూ. 10.05 కోట్లు డీజే - దువ్వాడ జగన్నాథం - రూ. 8.62 కోట్లు భరత్ అనే నేను - రూ. 8.41 కోట్లు ఉప్పెన - రూ. 8.26 కోట్లు మహర్షి - రూ. 8 కోట్లు ఖైదీ నంబర్ 150 - రూ. 7.99 కోట్లు సరిలేరు నీకెవ్వరు - రూ. 7.45 కోట్లు అరవింద సమేత - రూ. 7.11 కోట్లు


By February 15, 2021 at 11:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vaisshnav-tej-uppen-collects-rs-28-crore-share-worldwide-in-just-3-days/articleshow/80919289.cms

No comments