Breaking News

వెలకట్టలేని అందం అది.. నిజమైన అద్భుతం! ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు: చిరంజీవి


సీనియర్ హీరో అయినప్పటికీ నేటి హీరోలతో పోటీపడుతూ అటు వెండితెరపై ఇటు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు . లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చా అన్నట్లుగా ట్విట్టర్ ఖాతాలో వరుస పోస్టులు పెడుతూ సమాజంలోని పలు విషయాలపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకృతిపై ప్రేమ కురిపిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. తన ఇంటి నుంచి సూర్యోదయాన్ని వీడియో తీసి ఆ అందమైన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ''రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు పూర్తయినా సూర్యోదయం, సూర్యాస్తమయాల వెనకున్న ఆ అందాన్ని, అద్భుతాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని అందమైన దృశ్యాలవి. ఈ దృశ్యాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నేటి ఉదయం మా ఇంటి నుంచి తీసిన ఈ అందమైన వీడియోను మీతో పంచుకుంటున్నా'' అని పేర్కొన్నారు చిరంజీవి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే.. కొరటాల శివతో భారీ ప్రాజెక్టు 'ఆచార్య' చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ 'సిద్ధ' అనే ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మే 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


By February 15, 2021 at 01:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-tweet-on-beautiful-nature-in-the-world/articleshow/80921762.cms

No comments