Breaking News

వాటర్ బాటిల్ అనుకొని శానిటైజర్ తాగిన అధికారి.. సమావేశంలో షాక్!


ది ముంబై నగరానికి సంబంధించిన ఉన్నతస్థాయి సమావేశం. అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అందులోనూ 2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. అలాంటి సమావేశంలో ఓ ఉన్నతాధికారి కాస్త ఆందోళనకు గురైనట్లున్నారు. మంచినీళ్లు అనుకొని తన ముందున్న బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అప్పటికీ ఓ చుక్క శానిటైజర్ గొంతులోకి జారినట్లు కనిపిస్తోంది. బృహన్ ముంబై మహానగర పాలక సంస్థ (BMC) సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ అధికారి బీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌ పవార్‌. విద్యా శాఖ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఆయనే. బహుశా ఆ హడావుడిలో కాస్త టెన్షన్‌కు గురై ఉంటారు. వాటర్‌ బాటిల్‌ అనుకుని శానిటైజర్‌ను చేతిలోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరిగిన సమయంలో బీఎంసీ విద్యా కమిటీ చీఫ్‌ సంధ్య.. పవార్ పక్క సీట్లోనే ఉన్నారు. ఆ పరిణామానికి ఆమె నివ్వెరపోయారు. వెంటనే తేరుకున్న పవార్‌ అవి మంచినీళ్లు కాదని గ్రహించి శానిటైజర్‌ బాటిల్‌ను పక్కనపెట్టారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ముఖానికి మాస్కులు, భౌతిక దూరంతో పాటు పరిశుభ్రత కోసం శానిటైజర్లు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏ శుభకార్యానికీ, కార్యక్రమాలకు వెళ్లినా.. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. వాటర్ బాటిళ్లతో పాటు టేబుళ్లపై వాటిని కూడా పెడుతున్నారు. అటూ ఇటూ అయితే.. పరిస్థితి గందరగోళమే. కాబట్టి జాగ్రత్త..!


By February 03, 2021 at 03:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/brihanmumbai-municipal-corporation-assistant-commissioner-mistakenly-drinks-sanitizer-instead-of-water/articleshow/80667318.cms

No comments