Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి 13మందికి గాయాలు


ఒడిశా రాష్ట్రం రక్తసిక్తం అయ్యింది. ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ప్రాణాల్ని బలితీసుకుంది. మరో 13మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రాష్ట్రంలోని కోరాపుట్‌ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి సిందిగాం దగ్గర వ్యాన్ బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కోట్‌పాడ్‌ సమీపంలోని సిందిగుడ వద్ద చోటు చేసుకుంది. వ్యాన్‎లో సుమారుగా 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరంతా సిందిగుడ గ్రామం నుంచి ఛత్తీస్‌గఢ్‌లో కుల్దా గ్రామానికి వెళ్తున్నారు. కోట్‌పాడు వద్దకు రావానే వ్యాన్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే అతడు కూడా చనిపోయాడు. గాయపడిన వారిలో ఏడుగురిని కొరాపుట్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దర్నీ కొట్‌పాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


By February 01, 2021 at 07:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/9-dead-13-injured-in-odisha-road-accident/articleshow/80621464.cms

No comments