Breaking News

విజయవంతంగా నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ51.. నిర్దేశిత కక్ష్యలోకి 19 ఉపగ్రహాలు


తొలిసారిగా ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన చరిత్రాత్మక ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. ఆదివారం ఉదయం 10.23 గంటలకు పీఎస్ఎల్వీ ద్వారా తొలిసారిగా ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1 సహా మరో 18 ఉప్రగహాలను నింగిలోకి పంపారు. 14 విదేశీ, ప్రైవేట్ సంస్థలు రూపొందించిన ఆనంద్‌, సతీశ్‌ ధావన్‌, యునిటీశాట్‌ వంటి ఐదు ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 53వది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లాంచింగ్ ప్యాడ్-1 నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన 25.30 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8.54 గంటలకు ప్రారంభమయ్యింది. నిరంతరాయడంగా 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఉంచారు. ఎన్నో ప్రత్యేకతలు కూడిన ఈ ప్రయోగంలో ఉపగ్రహాలపై మొత్తం 20 వేల మంది పేర్లను రాశారు. ఇందులో 900 మంది విదేశీయుల పేర్లు, చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లు ఉన్నాయి. అలాగే, అంతరిక్షంలోకి తొలిసారి భగవద్గీతను, మోదీ ఫోటోలను పంపారు. నింగిలోకి పంపిన‘ఆనంద్‌’ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్‌ రూపొందించగా, ‘సతీశ్‌ ధావన్‌’ను చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్‌ (శ్రీపెరంబుదూర్‌), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌(నాగ్‌పూర్‌), శ్రీశక్తి శాట్‌ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు. బ్రెజిల్‌ రూపొందించిన అమోజానియా-1 తొలి భూ పర్యవేక్షణ ఉపగ్రహం..అంతరిక్ష రంగంలో సంస్కరణల తర్వాత ఈ ప్రయోగం ఇస్రో సహా దేశం మొత్తానికి ఎంతో ప్రత్యేకం. ‘అమెజాన్ ప్రాంతంలో అటవీ నిర్మూలన పర్యవేక్షణ, బ్రెజిల్ భూభాగం అంతటా వైవిధ్యభరితమైన వ్యవసాయం విశ్లేషణ కోసం వినియోగదారులకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడంలో ఈ ఉపగ్రహం సహకరించనుంది.


By February 28, 2021 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isros-pslv-c51-successfully-lifting-19-satellites-from-sriharikota/articleshow/81253947.cms

No comments