Breaking News

చరిత్ర సృష్టించిన ‘ఉప్పెన’.. 21 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ నిన్నటి వరకు టాలీవుడ్‌లో అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన ఒక డెబ్యూ హీరో సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ తన లైఫ్ టైమ్ రన్‌లో వసూలు చేసిన మొత్తాన్ని పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ తొలి వారంలోనే దాటేసింది. నిజానికి ‘ఉప్పెన’ తొలిరోజు కలెక్షన్ చూసినప్పుడే ఈ సినిమా తొలి వారం ముగిసే సరికి ‘చిరుత’ రికార్డును తిరగరాస్తుందని భావించారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘ఉప్పెన’ కేవలం మూడు రోజుల్లోనే టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన ఒక డెబ్యూ హీరో చిత్రంగా నిలిచింది. అయితే, ‘ఉప్పెన’ ఇప్పుడు ఆల్ ఇండియా రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్టింది. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ నిలిచింది. ఈ రికార్డు గతంలో హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ పేరిట ఉంది. ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. అయితే, ‘ఉప్పెన’ ఐదు రోజుల్లోనే రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ‘కహో నా ప్యార్ హై’ రికార్డును తిరగరాసింది. దీంతో రాబోయే కొత్త హీరోలకు వైష్ణవ్ తేజ్ చాలా పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసినట్టయింది. ఈ రికార్డు చాలా ఏళ్లపాటు పదిలంగా ఉండటం గ్యారంటీ. ఇదిలా ఉంటే, ‘ఉప్పెన’ ఐదో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.92 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ఐదు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన షేర్ మొత్తం రూ. 37.39 కోట్లకు చేరుకుంది. ప్రాంతాల వారీగా షేర్ కలెక్షన్ లెక్కలు ఇలా ఉన్నాయి.. నైజాం - రూ. 11.03 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 5.59 కోట్లు సీడెడ్ - రూ. 5.17 కోట్లు తూర్పుగోదావరి - రూ. 3.23 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 1.91 కోట్లు కృష్ణా - రూ. 2.2 కోట్లు గుంటూరు - రూ. 2.65 కోట్లు నెల్లూరు - రూ. 1.14 కోట్లు ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 32.92 కోట్లు ఓవర్సీస్ - రూ. 1.6 కోట్లు కర్ణాటక - రూ. 1.71 కోట్లు తమిళనాడు - రూ. 65 లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 51 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం: రూ. 37.39 కోట్లు


By February 17, 2021 at 02:52PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vaisshnav-tej-uppena-beats-21-years-hrithik-roshan-kaho-naa-pyaar-hai-record/articleshow/81049962.cms

No comments