Breaking News

FCUK Teaser: రసికరాజుగా జగపతిబాబు.. బండి ఇంకా కండిషన్‌లోనే ఉంది!


ప్రధాన పాత్రధారిగా రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’. టైటిల్‌లోని మ‌రో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. షార్ట్‌క‌ట్‌లో ఈ సినిమా ‘FCUK’గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పటివ‌ర‌కూ నాలుగు ప్రధాన పాత్రల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్స్ విల‌క్షణంగా ఉన్నాయంటూ అన్ని వ‌ర్గాల నుంచీ ప్రశంస‌లు ల‌భించాయి. కాగా, నూత‌న సంవ‌త్సరారంభం సంద‌ర్భంగా శుక్రవారం (జ‌న‌వ‌రి 1న) ఉద‌యం 9 గంట‌ల‌కు పలువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్‌లో సినిమాకు ప్రధానమైన నాలుగు పోస్టర్లను పరిచయం చేశారు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జగపతిబాబు పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. రొమాంటిక్ ఫాదర్‌గా ఆయన నటించారు. ‘‘ఈయన పేరు ఫణి భూపాల్. రాముడి బాణం వేగం గాలికి కూడా తెలియదంట. మనోడు అంత ఫాస్ట్‌గా అమ్మాయిల్ని పడేస్తాడు’’ అంటూ జగపతిబాబు పాత్రను పరిచయం చేశారు. ఫణి భూపాల్ కొడుకు కార్తీక్‌గా రామ్ కార్తీక్ నటించారు. ఈయనో పెద్ద బ్లఫ్ మాస్టర్. ఇక ఉమా చిన్న పిల్లల డాక్టర్. పెళ్లీడికి వచ్చిన కొడుకుని ఇంట్లో ఉంచుకుని ఒక ఆడబిడ్డకు తండ్రవుతాడు ఫణి భూపాల్. ఆ పాప పుట్టిన తరవాత ఫాద‌ర్‌, చిట్టి, ఉమ, కార్తీక్‌ మ‌ధ్య జరిగే వినోద‌భ‌రిత ప్రయాణమే ఈ సినిమా. కాగా, త్వర‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయ‌నున్నట్లు నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్రసాద్‌, డైరెక్టర్ విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శివ జి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరుణాకర్, ఆదిత్య మాటలు రాశారు. కిషోర్ మద్దాలి ఎడిటర్. కథ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం విద్యాసాగర్ రాజు.


By January 01, 2021 at 10:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jagapati-babu-fcuk-father-chitti-umaa-kaarthik-teaser-released/articleshow/80056451.cms

No comments