Breaking News

హిందూ మహాసముద్రంలో UUV డ్రోన్‌లు.. చైనా మరో కుయుక్తులు


హిందూ మహాసముద్రంపై పట్టు కోసం చైనా కొత్త పన్నాగాలకు తెరతీసింది. అమెరికాను తోసిరాజని ప్రపంచ వాణిజ్య శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న డ్రాగన్.. హిందూ మహాసముద్రంపై నియంత్రణ సాధించాలని కుట్రలు చేస్తోంది. భారత్‌తో యుద్ధం చేయాల్సి వచ్చినా, చుట్టుపక్కల ఇతర దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించాలన్నా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో నెలల తరబడి పనిచేసేలా నీటి డ్రోన్లను చైనా మోహరించినట్టు అమెరికా రక్షణ రంగ నిపుణుడు హైసుట్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌కు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అన్‌క్రూడ్ అండర్ వాటర్ (యూయూవీ) డ్రోన్లను డిసెంబరు 2019లోనే మోహరించిందని, 3,400కిపైగా పరిశీలనల తర్వాత వీటిని 2020 ఫిబ్రవరిలో వెనక్కు రప్పించిందని పేర్కొన్నారు. నౌకలు సురక్షితంగా ప్రయాణించడానికి అమెరికా నేవీ 2016లో మోహరించిన గ్లైడర్స్ మాదిరిగానే ఉన్నాయన్నారు. వీటిని 2016లో చైనా స్వాధీనం చేసుకుంది. ‘ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే హిందూ మహాసముద్రంలో ఈ రకమైన యూయూవీలను చైనా భారీగా మోహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్కిటిక్‌లోని ఐస్ బ్రేకర్ నుంచి సీ వింగ్‌ను చైనా మోహరించింది’ అని అన్నారు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ నుంచి వచ్చిన నివేదికలు హిందూ మహాసముద్రం మిషన్‌లో 14 మందిని నియమించనున్నట్లు సూచించినప్పటికీ 12 మంది మాత్రమే వినియోగించారు. పెద్ద రెక్కలతో ఉన్న ఈ గ్లైడర్‌లు సముద్ర గర్భంలో విహరించడానికి ఎక్కువ కాలం పనిచేయగలవని హెచ్‌ఐ సుట్టన్ చెప్పారు. అవి వేగంగా లేదా చురుకైనవి కావు, అయినప్పటికీ, అవి సుదూర మిషన్ల కోసం నియమించబడ్డాయని వివరించారు. ఇవన్నీ నిశితంగా గమనిస్తే చైనా కుట్రలు తేటతెల్లమవుతాయి. నీటిలో నెలల తరబడి పనిచేస్తూ ఈ సముద్రంపై సాగే ఇతర దేశాల నౌకాదళాలు, కోస్ట్‌ గార్డుల కదలికలను గుర్తించేందుకు యూయూవీ మోహరించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా హిందూ మహాసముద్రంలో జరిగిన పరిశోధనల ప్రకారం.. సరిహద్దుల్లో భారత్‌-చైనా ఘర్షణలు మొదలయ్యాక వీటిని అక్కడికి పంపారు. హిందూ మహాసముద్రంలో మోహరించిన ఈ గ్లైడర్ల ద్వారా సముద్ర గర్భంలో డేటాను సేకరిస్తున్నట్లు తెలిసింది, ఇది అంత ప్రమాదకారం కాకపోయినప్పటికీ నౌకాదళ ఇంటెలిజెన్స్ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. ఇటీవల డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను గమనిస్తున్నామని, హిందూ మహాసముద్రం (ఐఓఆర్)లో వ్యూహాత్మక స్థావరాల కోసం ప్రపంచం పరుగులు పెడుతోందన్నారు. రాబోయే కాలంలో ఇది మరింత ఊపందుకుంటుందని అన్నారు. ‘ఇండో-పసిఫిక్ జియోస్ట్రాటజిక్ పోటీతో పాటు హిందూ మహాసముద్రం ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలు, స్థావరాల కోసం కూడా పోటీ నెలకుంది. ఇది రాబోయే కాలంలో మరింత ఊపందుకుంటుంది’ అని జనరల్ రావత్ చెప్పారు.


By January 01, 2021 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-deploying-en-masse-underwater-drones-in-indian-ocean-forbes-report/articleshow/80056160.cms

No comments