Breaking News

గూగుల్ మ్యాప్ ఫాలో అయి.. డ్యాంలో పడిన కారు ఒకరు మృతి


ఒకప్పుడు అడ్రస్ తెలియకపోతే.. దారంతా కనుక్కొనిపోయేవాళ్లు. రోడ్డుపై ఏర్పాటు చేసిన నేమ్ బోర్డలను.. సైన్ బోర్డులను చూస్తూ.. వెళ్లేవారు. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్ వచ్చాక ప్రయాణం చాలా ఈజీ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ముందే లొకేషన్ సెట్ చేసుకొని మ్యాప్ ఆధారంగా దారి చూసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ చూపించే దారి ప్రమాదాల్లోకి నెట్టేస్తోంది. తాజాగా కొందరు వ్యక్తి గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్లి కారుతో సహా ఏకంగా డ్యాంలో పడిపోయాడు. ఒకరు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పుణెకు చెందిన గురు శేఖర్ ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతడు.. తన మిత్రులు సమీర్, ఇంకో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. వీరికి కూడా శేఖర్ డ్రైవర్ సతీష్‌ ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం వేళ అక్కడకు బయలుదేరిన వీళ్లు మధ్యలో దారి తప్పిపోయారు. దీంతో వాళ్లంతా తమ సెల్ ఫోన్లలో ఉన్న గూగుల్ మ్యాప్స్ లో దారి కోసం వెతికారు. దీంతో గూగుల్ ఒక రూట్ ను చూపించింది దాన్ని ఫాలో అవుతూ కొంతదూరం వెళ్లేసరికి చీకటి పడిపోయింది. గూగుల్‌ మ్యాప్‌ చూపిస్తుందన్న ధైర్యంతో.. వాళ్లు ఒక డ్యామ్ దగ్గరకు కారుతో సహా చేరుకున్నారు. ఆ డ్యామ్ పై ఉన్న బ్రిడ్జి దాటితే పక్కనున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోవచ్చు అని భావించారు. Read More: మ్యాప్‌ బ్రిడ్జి చూపించగా.. కారు నడుపుతున్న వ్యక్తి.. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును ముందుకు పోనిచ్చాడు. అయితే అక్కడ బ్రిడ్జ్ లేదు నీటి ప్రవాహంలో కారు డ్యాంలో కొట్టుకుపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని బయటపడ్డారు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ సతీష్‌ మాత్రం కారులోని చిక్కుపోయి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయాడు. దీంతో ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు మరునాడు ఘటనాస్థాలనికి చేరుకున్నారు. డ్యాంకు కొంతదూరంలో కారును గుర్తించిన పోలీసులు.. అందులో సతీష్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే, అక్కడ బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందని.. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జి పై నుంచి నీటి ప్రవాహం ఉంటుందని స్థానికులు చెప్పారు. ఈ బ్రిడ్జికిపైనే పెద్ద డ్యామ్ ఉండడంతో.. ఆ నీటిని విడుదల చేసినప్పుడు బ్రిడ్జి మునిగిపోతుందని తెలిపారు. గూగుల్‌ మ్యాప్‌ దారి చూపించింది కరెక్ట్ అయినా అక్కడ బ్రిడ్జ్ ఉన్న మాట కూడా వాస్తవమే అయినా... నైట్ జర్నీ కావడం వల్ల వారికి సరిగా అక్కడ ఏ ఉందో తెలియలేదు. దీంతో అనవసరంగా ఓ అమాయక ప్రాణం పోయింది.


By January 13, 2021 at 01:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/car-follows-google-maps-drowns-in-dam-one-died-at-ahmednagar/articleshow/80246295.cms

No comments