Breaking News

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ భారీ చోరీ కేసు.. చేధించిన సైబరాబాద్ పోలీసులు


తమిళనాడు: హోసూరు ముత్తూట్ ఫైనాన్స్‌ దోపిడీ కేసును చేధించారు. ఈ కేసులో నలుగురు దోపిడీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు సమీపంలో ఉన్న హోసూరు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 22న ఉదయం 9.30 గంటలకు ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులను గన్‌తో బెదిరించి బంధించిన దుండగులు.. లాకర్లలో ఉన్న బంగారం, నగదును మొత్తం ఎత్తుకెళ్లిపోయారు. మొత్తం రూ.7 కోట్ల సొత్తు చోరీ చేశారని సంస్థ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. దొంగతనం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


By January 23, 2021 at 10:41AM


Read More https://telugu.samayam.com/telangana/hyderabad/tamil-nadu-muthoot-finance-robbery-case-cyberabad-police-arrested-4-accused/articleshow/80418106.cms

No comments