Breaking News

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే.. హెల్త్ వర్కర్ కన్నుమూత


ఉత్తరప్రదేశ్: మోరాదాబాద్ జిల్లాలో తీసుకున్న మరుసటి రోజే మహిపాల్ సింగ్ అనే వార్డ్ బాయ్ మరణించారు. 46 ఏళ్ల మహిపాల్ శనివారం కొవిషీల్డ్ టీకా తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో అసౌకర్యంగా ఉందన్న ఆయన.. ఆదివారం కన్నుమూశారు. శనివారం మధ్యహ్నం 12 గంటల సమయంలో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారని అక్కడి హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మెక్ గార్గ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మహిపాల్‌కు ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైందని.. ఆయన వ్యాక్సిన్ తీసుకున్నాక రాత్రి షిఫ్ట్‌లో పని చేశారని గార్గ్ తెలిపారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా మహిపాల్ మరణించారని అనుకోవడం లేదన్నారు. ఆయన మరణానికి గల కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బాడీని పోస్టుమార్టానికి పంపుతామన్నారు. మోరాదాబాద్ జిల్లాలో తొలి రోజు 479 మంది హెల్త్ వర్కర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మహిపాల్‌కు గతంలో కరోనా సోకలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మహిపాల్ చనిపోయి ఉంటాడని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ‘‘వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాగోలేదని మా నాన్న నాకు చెప్పారు. ఆయన టూవీలర్ నడిపే స్థితిలో లేకపోవడంతో.. ఆటోలో హాస్పిటల్‌‌కు వచ్చి ఇంటికి తీసుకెళ్లమని నాకు చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హాస్పిటల్‌కు వెళ్లాను. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. ఆయన అసాధారణంగా కనిపించారు. నాన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఇంటికి తీసుకొచ్చి టీ ఇచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్పాను. ఆదివారం పని కోసం నేను బయటకు వెళ్లాను. మీ నాన్న పరిస్థితి క్షీణిస్తోందని.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు చెప్పారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నా’’ అని మహిపాల్ కుమారుడు విశాల్ తెలిపారు.


By January 18, 2021 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttar-pradesh-ward-boy-dies-day-after-getting-vaccine-for-coronavirus/articleshow/80323572.cms

No comments