Breaking News

కరోనా కారణంగా ప్రముఖ గేయ రచయిత అనిల్ పనాచూరన్ కన్నుమూత


మలయాళ కవి, ప్రముఖ గేయ రచయిత కరోనా సోకడంతో కొన్నిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కరోనా చికిత్స పొందుతూనే ఆయన గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు. అనిల్ పనాచూరన్ రాసిన గేయాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఆయన రాసిన అరబ్బీ కథ, కథ పరయుంబోల్, మాడంబి, మేరిక్కుందోరు కుంజాడు, వెలిపాండింటే చిత్రాల గేయాలు ప్రజాదరణ చూరగొన్నాయి. అనిల్ రాసిన వలాయిల్ వీణ కిలికల్, అనాథన్, ప్రాణాయాకం కవితలు ప్రసిద్ధి చెందాయి. కవి అనిల్ పనాచూరన్ మరణ వార్త తెలిసి పలువురు మలయాళీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాలా తదితరులు అనిల్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. పనాచూరన్ అకాల మరణం కేరళ రాష్ట్ర సాంస్కృతిక, చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం విజయన్ అన్నారు. పనాచూరన్‌తో తనకు మంచి సంబంధం ఉందని, ప్రతిభావంతుడైన కవి, గీత రచయితను కోల్పోయామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.


By January 04, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/malayalam-lyricist-anil-panachooran-passes-away/articleshow/80090805.cms

No comments