గుడ్‌న్యూస్.. కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు డీసీజీఐ షరతులతో కూడిన అనుమతి
దేశంలో భారత్ బయోటెక్, ఆక్స్‌ఫర్డ్ టీకాలకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. స్వదేశీ టీకా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సామర్థ్యం, భద్రత ఇప్పటికే నిరూపితమైనట్లు డీసీజీఐ వెల్లడించింది. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశారు. కొవాగ్జిన్ తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌లో 800 మంది వాలంటీర్లలో విజయవంతమయ్యిందని పేర్కొంది. అలాగే, మూడో దశలో 25,800 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారని తెలిపింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను.. పుణేలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది. కోవిడ్ టీకాల అత్యవసర వినియోగం కింద అనుమతి కోసం సీరమ్ సంస్థ, భారత్ బయోటెక్‌లు నియంత్రణ సంస్థలకు దరఖాస్తును చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను CDSCO ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పలుసార్లు సమావేశమై పరిశీలించింది. శనివారం (జనవరి 2) మరోసారి సమావేశమైన నిపుణుల బృందం పరిశీలన అనంతరం షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ ()కు సిఫార్సు చేసింది. దీంతో డీసీజీఐ ఆమోద ముద్ర వేస్తూ ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
By January 03, 2021 at 11:46AM
No comments