Breaking News

‘సలార్’ అదిరిపోయే అప్‌డేట్: ప్రభాస్ సినిమా ప్రారంభోత్సవానికి యశ్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘కె.జి.యఫ్’ దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ ‘సలార్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. హీరో క్యారెక్టర్‌ను డిఫ‌రెంట్‌గా డిజైన్ చేయ‌డ‌మే కాకుండా, అప్పటి వ‌ర‌కు చూడ‌ని లుక్‌లో ప్రభాస్‌ను చూపించారు. దీంతో ఈ లుక్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటించిన రోజు నుండీ ప్రేక్షకాభిమానుల్లో ఎగ్జయిట్‌మెంట్‌ పెరిగిపోయింది. కాగా, సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది హోంబలే ఫిలింస్. ‘స‌లార్‌’ చిత్రాన్ని జ‌న‌వ‌రి 15న ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘స‌లార్’ చిత్రయూనిట్ స‌హా క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయ‌ణ్ సీఎన్‌, ద‌ర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, క‌న్నడ రాకింగ్ స్టార్ య‌శ్ స‌హా ఇత‌ర సినీ ప్రముఖులు హాజ‌రుకానున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రసీధ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, సాషా ఛేత్రి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


By January 14, 2021 at 12:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hombale-films-prashanth-neel-and-prabhas-to-kick-start-salaar-with-muhurat-puja-on-january-15th/articleshow/80264267.cms

No comments