Breaking News

జల్లికట్టుకు రాహుల్ గాంధీ... బీజేపీ చీఫ్ కూడా


తమిళనాడులో సంక్రాంతి అంటే అందరకీ గుర్తుకు వచ్చేది జల్లికట్టు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మధురై అవనియాపురంలో 800 ఎద్దులతో జల్లికట్టును నిర్వహిస్తున్నారు. ఎద్దులను పట్టుకోవడానికి 600 మంది యువకులు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఈసారి ఈ జల్లికట్టు వేడుకను రాహుల్ గాంధీ వెళ్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ క్రీడ... ఇప్పుడు పొలిటికల్‌ ఫైట్‌కు వేదికైంది. ఇవాళ రాహుల్‌ గాంధీ... జల్లికట్టు ఉత్సవాలకు హాజరై ఢిల్లీ రైతులకు సంఘీభావం తెలపనుండగా... బీజేపీ చీఫ్ నడ్డా కూడా జల్లికట్టు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో జాతీయ పార్టీలు జల్లికట్టులో సైతం పోటీ పడుతున్నాయి. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ద్రవిడ గడ్డపై జెండా పాతేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇదే సమయంలో పెద్ద పండగ వేదికగా... జల్లికట్టు సెంటిమెంట్‌ను పండిస్తూ ఓట్లు కోసం తమిళ తంబీలను మచ్చిక చేసుకునేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రంగంలోకి దిగాయి. జల్లికట్టును ఆధారంగా చేసుకొని తమిళనాట పొలిటికల్‌ గేమ్‌కు తెరలేపాయి. బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ... ఇవాళ చెన్నైలో పర్యటిస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు భారీ ఏర్పాట్లు చేశాయి. మధురై జిల్లా అవానిపురంలో జల్లికట్టు ఉత్సవాలకు హాజరవుతారు రాహుల్‌. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా ఆందోళన చేపట్టనున్నారు. ఇటు జేపీ నడ్డా కూడా ఇదేరోజు పర్యటించి... జల్లికట్టును వీక్షించనున్నారు. మరోవైపు గతంలో జల్లికట్టును కాంగ్రెస్‌ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు బీజేపీ నేత ఖుష్బూ. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు నేతలు పర్యటించడం... అదీ ఒకే రోజు కావడం... ఇప్పుడు ఆసక్తిగా మారింది.


By January 14, 2021 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rahul-gandhi-and-jp-nadda-to-participate-in-jallikattu-at-tamilnadu/articleshow/80263447.cms

No comments