Breaking News

కోవిడ్ టీకా వేసుకుంటే నపుంసకులవుతారా? జోరుగా ప్రచారం.. కేంద్రం స్పందన ఇదీ


మహమ్మారిపై భారత్ పోరాటం కీలక ఘట్టానికి చేరుకుంది. కరోనాను నిలువరించే టీకా ప్రక్రియ శనివారం భారత్ ప్రారంభించనుంది. కానీ, కోవిడ్ టీకాలపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు నెలకున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. టీకా వేయించుకున్న కొద్దిమందిలో దుష్ప్రభావాలు తలెత్తడంతో పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రజల్లో అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కరోనా టీకా వేయించుకున్నవారికి వంధత్వం ఏర్పడుతుందని జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. కోవిడ్ టీకాతో నపుంసకులు అవుతారంటూ ఇటీవల ఒక రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఖండించారు. కరోనా టీకా కారణంగా మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలెవరూ చెప్పలేదని, అటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొన్నారు. ఇవన్నీ వదంతులేనని, నిరాధారామైన ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే, కోవిడ్ టీకా తీసుకున్న తరువాత కొద్దిమందిలో స్వల్ప జ్వరం, వ్యాక్సిన్ ఇచ్చిన ప్రాంతంలో నొప్పి ఉండటం సాధారణమని అన్నారు. ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందని, కొద్ది సేపటిలోనే ఇటువంటి సమస్యలు మాయయవుతాయని అన్నారు. కాగా, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు భారత్ శ్రీకారం చుడుతోందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం అవుతుంది.. ‘జన్ భగీదరి’ సూత్రాలపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి’ అని పేర్కొంది. దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, తొలి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నామని వివరించింది. ‘టీకా కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కో-విన్‌ను ఉపయోగిస్తున్నాు.. ఇది టీకా స్టాక్స్, నిల్వ ఉష్ణోగ్రత, కోవిడ్ -19 వ్యాక్సిన్ లబ్ధిదారుల వ్యక్తిగత ట్రాకింగ్ సమాచారాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది.


By January 15, 2021 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/can-covid-19-vaccine-cause-infertility-health-minister-harsh-vardhan-dispels-myths/articleshow/80278173.cms

No comments