Breaking News

బాలయ్య కొడుకు ఎంట్రీకి అంతా సిద్ధం..! నందమూరి అభిమానుల కోసం రంగంలోకి స్టార్ డైరెక్టర్


తన విలక్షణ నటనతో తెలుగు తెరపై సత్తా చాటి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. తన వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి సక్సెస్ అయ్యారు. నందమూరి నట వారసుడిగా ఇన్నేళ్ల పాటు హవా కొనసాగించారు. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ నందమూరి అభిమాన వర్గాన్ని అమాంతం పెంచేశారు. ఇక ఈ కుటుంబం నుంచి మూడో తరంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సత్తా చాటుతుండగా.. ఆ లిస్టులో తన తనయుడు మోక్షజ్ఞను కూడా చేర్చబోతున్నారు బాలయ్య. ఇందుకోసం ఓ స్టార్ డైరెక్టర్‌తో కలిసి స్కెచ్చేశారని తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణ కొడుకు సినీ గడప తొక్కబోతున్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి' తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అది జరగకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇక కొద్దిరోజుల క్రితం నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ ఓ ఆలయంలో పూజలు చేయడంతో మోక్షజ్ఞ తొలి సినిమా ప్రారంభం కోసమే ఈ పూజలు అనే ప్రచారం జరిగింది. చివరకు అది కూడా నిజం కాలేదు. అయితే ఉంటుందని బాలయ్య స్వయంగా ప్రకటించారు కాబట్టి ఎలాగైనా ఆయన కెమెరా ముందుకు రావడం ఖాయమే అని ఫిక్సయిన అభిమానులకు దర్శకదీరుడు రాజమౌళి రూపంలో గుడ్ న్యూస్ వినిపించింది. జక్కన్నతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ దానికీ ముహూర్తం కుదరలేదు. ఇక తాజాగా అయితే నందమూరి అభిమానుల కోసం రంగంలోకి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రంగంలోకి దిగుతున్నారనే వార్త మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. మోక్షజ్ఞను త్వరలోనే చిత్రసీమకు పరిచయం చేయాలన్న పట్టుదలతో ఉన్న బాలయ్య బాబు.. మోక్షజ్ఞ లుక్ మార్చేందుకు గాను ప్రత్యేకంగా ట్రైనర్లను నియమించారట. అంతేకాదు ఇటీవలే పూరిజగన్నాథ్ వినిపించిన కథ నచ్చడంతో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఆయనతో కన్ఫర్మ్ చేశారని టాక్. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమాను ప్రారంభించాలని బాలయ్య సూచించారట. సో.. ఇదే జరిగితే నందమూరి అభిమానులకు ఇంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి.


By January 24, 2021 at 12:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mokshagna-entry-confirm-with-director-puri-jagannadh/articleshow/80431967.cms

No comments