Breaking News

భారత్‌లో తగ్గిన కరోనా కేసులు, యాక్టివ్ కేసులు 2 శాతమే


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 20 వేల లోపే నమోదవుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 15,968 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం (జనవరి 13) తెలిపింది. తాజా కేసులతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95 వేలకు చేరింది. కొవిడ్-19 బారినపడి దేశంలో ఇప్పటివరకు 1,51,529 మంది మరణించారు. మంగళవారం కొత్తగా 202 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. సోమవారం 12,584 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. సోమవారంతో పోల్చితే మంగళవారం పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగినా.. మొత్తం మీద వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే చెప్పవచ్చు. కొవిడ్- 19 నుంచి కోలుకొని మంగళవారం 17,817 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,01,29,111 మందికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 2,14,507 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 2.04 శాతం కావడం గమనార్హం. మంగళవారం దేశవ్యాప్తంగా 8,36,227 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు.. కరోనా వ్యాక్సిన్ ఆయా రాష్ట్రాల్లో నిల్వ కేంద్రాలకు చేరుకుంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీకి అంతా సిద్ధం చేశారు. దేశ ప్రజలకు ఇది మరింత ఊరట కలిగించే వార్త. అయితే.. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకునేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలను పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. Also Read:


By January 13, 2021 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-adds-15968-cases-on-jan-13-active-cases-drop-to-2-14-lakh/articleshow/80245351.cms

No comments