Breaking News

Ravi Teja: ర‌వితేజతో గోవాకు పయనమైన శృతిహాసన్.. అక్కడితో ఫినిష్ చేయనున్న మాస్ మహారాజ్


ర‌వితేజతో కలిసి గోవాకు పయనమైంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్. గత కొంతకాలంగా మాస్ మాహారాజ్‌తో కలిసి క్రాక్ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె గోవా షెడ్యూల్‌తో మొత్తం ఫినిష్ చేయనుంది. అదేనండీ.. (డిసెంబర్ 4) రేపటినుంచి మొదలు కాబోతున్న షెడ్యూల్ 'క్రాక్' సినిమాకు చివరి షెడ్యూల్ కానుంది. గోవా పర్యటనతో షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నామని తాజాగా ప్రకటించింది చిత్రయూనిట్. మాస్ మ‌హారాజ్ , హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తోన్న సినిమా ''. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్త‌యిన ఈ చిత్రానికి సంబంధించి ఓ పాట చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది. శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 4) నుంచి ప్రారంభం కానున్న చివ‌రి షెడ్యూల్‌లో ఈ సాంగ్ షూట్ చేయనున్నారు. గోవాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ర‌వితేజ‌, శృతిహాసన్ లపై ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూరుస్తున్న ఈ పాట‌తో క్రాక్ షూటింగ్ మొత్తం పూర్తికానుంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారట మేకర్స్. Also Read: తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాను అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఇంటెన్స్ స్టోరీతో కెమెరాలో బంధిస్తున్నారు. ఈ చిత్రంలో అప్స‌రా రాణి స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ‌ "భూమ్ బ‌ద్ద‌ల్" స్పెష‌ల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా 'క్రాక్' మూవీని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.


By December 03, 2020 at 02:17PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raviteja-krack-team-off-to-goa/articleshow/79545157.cms

No comments