నిహారిక పెళ్లి సందడి షురూ.. గ్రాండ్ పార్టీ చేసుకున్న మెగా ఫ్యామిలీ.. జోష్‌లో చిరంజీవి డాటర్స్
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె షురూ చేసేసింది మెగా ఫ్యామిలీ. నిహారిక- చైతన్య ఒక్కటి కాబోతున్న ముహూర్తానికి వారం ముందు నుంచే సంబరాలు స్టార్ట్ చేశారు. బుధవారం రాత్రి మెగా కాంపౌండ్ వారసులంతా ఒక్కచోట చేరి నిహారిక, ఆమెకు కాబోయే భర్త చైతన్యకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చిరంజీవి కూతుళ్లు శ్రీజ, సుస్మిత సహా మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ తెగ సందడి చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక- చైతన్యలతో మెగా వారసులంతా ఫుల్ ఎంజాయ్ చేశారనడానికి ఈ ఫొటోలే సాక్ష్యం. పార్టీలో వరుణ్ తేజ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత పాల్గొన్నారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. ''చైనిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫ్యామిలీ అంతా కలిసి రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసాం'' అని పేర్కొన్నారు. కాకపోతే ఈ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కనిపించకపోవడంతో కాస్త వెలితిగా ఉందంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read: ఆగస్టు నెలలో నిహారిక- చైతన్య నిశ్చితార్ధ వేడుక జరిగింది. అప్పటి నుంచే ఈ ఇద్దరి ఫోటోలు, పెళ్లి సంగతులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే చైనిహారిక పెళ్లి డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో జరగనుందని నాగబాబు చేసిన ప్రకటనతో సినీ లోకమంతా ఈ శుభ ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారని టాక్. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసి టాలీవుడ్ మొత్తానికి పార్టీ ఇవ్వనుంది మెగా ఫ్యామిలీ.
By December 03, 2020 at 01:37PM
No comments