Breaking News

CID: మహిళా డీఎస్పీ ఆత్మహత్య.! కలకలం


మహిళా డీఎస్పీ ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి(33) తన స్నేహితురాలి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. డిన్నర్‌కి వెళ్లిన ఆమె గదిలో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కోలార్ జిల్లా మలూరు తాలూకా మాస్తి గ్రామానికి చెందిన లక్ష్మి గతంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం 2014లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపికై 2017లో డీఎస్పీగా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆమె బెంగళూరులోని కోనణకుంటెలో కుటుంబంతో నివాసముంటున్నారు. పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌‌లోని ఇంట్లో స్నేహితులతో డిన్నర్‌కి వెళ్లారు. అక్కడే ఆమె ఒక గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసి షాక్‌కి గురయ్యారు. ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగంలో చేరేందుకు ముందే 2012లో ఆమెకు వివాహమైనట్లు తెలుస్తోంది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటారని చెబుతున్నారు. మనస్పర్థల కారణంగా రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్రెషన్‌కి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డిన్నర్‌కి తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులపై తనకు అనుమానం ఉందంటూ ఆమె తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఆ ఇద్దరే చంపేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసుల విచారణ చేపట్టారు. Also Read:


By December 17, 2020 at 01:57PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-police-officer-kills-self-in-bengaluru/articleshow/79775986.cms

No comments