మద్యం మత్తులో మరిది ఘాతుకం.. గుంటూరులో దారుణం
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో మరిది ఘాతుకానికి తెగబడ్డాడు. వదినను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇనుపరాడ్డుతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ అమానుష ఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఎస్తేరు రాణి(35)కి మరిదితో గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె మరిది ఐరన్ రాడ్డుతో వదినపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By December 17, 2020 at 02:19PM
No comments