Director Teja: దర్శకుడు తేజకు శ్రీరెడ్డి దారుణమైన వీడియో.. లైవ్‌లో ** చూపిస్తూ వార్నింగ్
వివాదస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న మరోసారి దర్శకుడు తేజపై విరుచుకుపడింది. అసభ్యకరమైన రీతిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ తన ఫేస్‌బుక్‌లో వీడియో వదిలింది శ్రీరెడ్డి. ఆమె మాట్లాడుతూ.. ‘దర్శకుడు తేజా గారికి పెద్ద నమస్కారాలు.. మీరు బాగా అనుభవం ఉన్న డైరెక్టర్.. మేం స్కూల్‌కి వెళ్లే రోజుల్లోనే మీరు డైరెక్షన్ చేశారట. మీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.. మీరు కాంట్రవర్శీ డైరెక్టర్ కూడా.. అమ్మాయిల్ని కొడతారంట. అప్పట్నుంచే మీ మీద నాకు కోపం ఉండేది. అమ్మాయిల్ని కొట్టడం ఏంటి నాన్ సెన్స్ అని.. మీ కోపం.. టార్చర్ అదొక ట్రెండ్‌గా అయ్యింది. ఒకప్పుడు నేను మీకు అభిమానిని.. మీ గురించి చాలా మంచిగా అనుకున్నా. అది వేరే కానీ.. తేజా గారూ!! మీరు యూట్యూబ్‌లో నాగురించి మాట్లాడిన కామెంట్స్ చూశా.. మీకు చాలా గౌరవంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే.. ‘మీరు నాకు అది’ అంటూ ప్రైవేట్ పార్ట్ దగ్గర చేయి పెట్టి అసభ్యకరమైన రీతిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఇంకెప్పుడూ నాకు వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయకండి.. ఏ అమ్మాయితో అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పులు పడతాయి. రెండు మూడు హిట్లు కొట్టినంత మాత్రాన నువ్వేం సంఘసంస్కర్తవేం కాదు.. నువ్వేం గొప్పోడివేం కాదు.. ఇండస్ట్రీ ఎవడిది అంటున్నావ్.. ఇండస్ట్రీ అందరిదీ.. తప్పులు జరుగుతున్నప్పుడు నాలాంటి అమ్మాయిలు ప్రశ్నించాలి. నేను ఒక న్యూస్ రిపోర్టర్‌గా న్యూస్ లీడర్‌గా ప్రశ్నించా.. నేను ఒక యాంకర్‌కి యాక్టర్‌ని క్వచ్ఛన్ చేయడానికి అన్ని అధికారాలు ఉన్నాయి నాకు. శ్రీరెడ్డో.. రామ్ గోపాల్ వర్మో అని అంటే.. వర్మ కాలికి కూడా సరిపోవు నువ్వు. నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని అనుకోవడం లేదు.. నువ్వు సురేష్ బాబుకి తొత్తువి. వాళ్ల ఆస్థాన డైరెక్టర్‌వి.. వాళ్లనేదో లేపాలని అనుకుంటావ్.. నువ్ లేవలేవు వాళ్లని లేపలేవు. కిందా మీదా అన్నీ మూసుకుని పని చూసుకో.. పో’ అంటూ శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో దర్శకుడు తేజకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ శ్రీరెడ్డికి ఇంత కోపం రావడానికి కారణం ఏంటి?? ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం శ్రీరెడ్డిని దూరం పెట్టాలని అనుకున్నప్పుడు సినిమా ఛాన్స్ ఇస్తానని ముందుకు వచ్చిన దర్శకుడు .. అలాంటి దర్శకుడికి ఇంత దారుణమైన వార్నింగ్ ఎందుకు ఇచ్చింది అంటే.. దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై తేజ ఘాటుగా స్పందించారు. అప్పట్లో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ పరువు రోడ్డున పడిందని.. ఆ ఉదంతాన్ని వెనుకుండి నడిపింది స్వయానా రామ్ గోపాల్ వర్మ అని ఆయనే ఒప్పుకోవడం.. శ్రీరెడ్డిని వర్మ ఝాన్సీ లక్ష్మీ భాయితో పోల్చడం పట్ల తేజ అభిప్రాయాన్ని అడిగారు యాంకర్. దీనిపై దర్శకుడు తేజ ఘాటుగా స్పందిస్తూ.. ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరన్నారు. ‘ఇండస్ట్రీ అంటే తమాషాగా ఉందా? ఎవరో నలుగురైదుగురు కలిసి ఇండస్ట్రీని రోడ్డుకి లాగేస్తాం అంటే ఇక్కడ గాజులు తొడుక్కుని ఉన్నామా? అవన్నీ కుదరవు. ఎవరూ ఇండస్ట్రీని ఏం లాగలేరు. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఏం వచ్చినా ఏం పీకలేరు. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి అయినా సరే ఇండస్ట్రీని ఏం చేయలేరు. అప్పుడు ఆమె (శ్రీరెడ్డి) ఏదో చూసిందని ఇండస్ట్రీ పరువును రోడ్డుకి లాగేసిందని మీడియా వాళ్లు అన్నారు తప్పితే ఇండస్ట్రీ పరువు ఏం కాలేదు. ఎవరికి రోడ్డుకి లాగేటంత సీన్ లేదు. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన నా లాంటి వాళ్లకు ఏం అనిపించలేదు’ అంటూ వర్మపైన శ్రీరెడ్డిపైన తేజ వివాదాస్పద కామెంట్స్ చేయడంతో శ్రీరెడ్డికి మండింది. అప్పట్లోనే తేజకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి. ‘రేపు తేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మరిచిపోయావా’ అంటూ వరుస పోస్ట్‌లు వదిలింది. ‘రామ్ గోపాల్ వర్మకి ఆకు.. నాకు ఈక ఎవరు? ఇంకెవరు తేజం’ అంటూ మరో పోస్ట్ పెట్టింది. ‘డైరెక్టర్ తేజ గారు రామ్ గోపాల్ వర్మని, నన్ను అనేంత బొమ్మ లేదు గాని.. ఫస్ట్ మీ బొమ్మలకి హిట్ ఇవ్వండి. నా బొచ్చు’ అంటూ తనదైన శైలిలో నోటికి పని చెప్పింది శ్రీరెడ్డి. ఇదంతా జరిగింది గత ఏడాది జూన్ నెలలో.. అయితే మరోసారి తేజకు వార్నింగ్ ఇస్తూ వార్తల్లోకి వచ్చింది శ్రీరెడ్డి. ఇదిలా ఉంటే.. గతంలో శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ మొత్తం ఆమెపై ఆగ్రహంతో అవకాశాలు ఇవ్వని తరుణంలో దర్శకుడు తేజ ఆమెను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. అప్పట్లో ఆయన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఆ సినిమాలో శ్రీరెడ్డికి మంచి పాత్రను ఇస్తున్నట్టు ప్రామిస్ చేశారు. అంతే కాకుండా శ్రీరెడ్డికి మంచి అవకాశాలు ఇవ్వాలని డైరెక్టర్లకు నిర్మాతలకు రిక్వెస్ట్ చేశారు తేజ. అయితే తరువాత జరిగిన పరిణామాలతో ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీ నుండి తేజ తప్పకున్నారు. ఆ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. దీంతో శ్రీరెడ్డికి ఇచ్చిన ప్రామిస్‌ని నిలబెట్టుకోలేకపోయారు. ఆ తరువాత తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనూ శ్రీరెడ్డికి అవకాశం లభించలేదు.
By December 17, 2020 at 01:54PM
No comments