Chiranjeevi: ఆచార్య సెట్‌లో భర్తతో కలిసి కాజల్ హంగామా.. అలా కొత్త జంటను ఖుషీ చేసిన చిరంజీవి
ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటిదైన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అగర్వాల్.. తిరిగి సెట్స్‌పై చేరిపోయింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులపాటు హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ, ఏకంగా తన భర్త గౌతమ్ కిచ్లూని తీసుకొని నేటి (మంగళవారం) ఉదయం తన లేటెస్ట్ మూవీ '' సెట్స్‌కి వచ్చింది. నవ దంపతులను చూసి ఎంతో మురిసిపోయిన మెగాస్టార్ వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన భారీ సెట్లో 'ఆచార్య' షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్‌లపై పాట చిత్రీకరణ చేయనున్నారు. ఇందుకోసం కాజల్ తన భర్తతో సహా ఆచార్య సెట్స్‌కి విచ్చేసి చిత్ర బృందాన్ని సర్‌ప్రైజ్ చేసింది. దీంతో కాజల్- గౌతమ్ జంటకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జంటతో దండలు మార్పించి కేక్ కట్ చేయించారు. ఈ సెలబ్రేషన్‌లో చిరంజీవితో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్, సహ నిర్మాత అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Also Read: కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో ఎస్. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో 'ఆచార్య' మూవీ రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండనుందని టాక్. ఇందులో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి 152వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
By December 15, 2020 at 01:17PM
No comments