94 రేప్ సీన్లు.. ఏ నటుడికీ లేని రికార్డు ఆయన సొంతం
సినిమాల్లో హీరోయిన్‌ని గానీ, హీరో సోదరిని గానీ ఎవరైనా ఇబ్బంది పెడితే హీరో రెచ్చిపోతుంటాడు. గతంలో చాలా సినిమాలు అత్యాచారాల చుట్టూనే తిరిగేవి. విలన్ తమ భార్యనో, చెల్లినో రేప్ చేస్తే వారిపై హీరో పగ తీర్చుకోవడమే కథాంశంగా ఉండేది. అయితే సినిమాల్లో చేసే రేపులన్నీ ఉత్తుత్తివే కావొచ్చు. అయినా సరే ఒకరిపై ఒకరు కిందా మీదా పడితే కాని సీన్ పండదు. ఒకప్పుడు రేప్ సీన్లు లేనిదో సినిమా ఆడని పరిస్థితి ఉండేది. అలాంటి రేప్ సీన్లకు ఎంతో ప్రసిద్ధి. తమ సినిమాలో రేప్ సీన్ ఉందంటే దర్శక నిర్మాతలు మొదట ఆయన్నే సంప్రదించేవారట. దీంతో ఆయన ఏకంగా 94 రేప్ సీన్లలో పాల్గొని హిస్టరీ క్రియేట్ చేశారు. Also Read: సినిమాల్లో కాస్త సీనియారిటీ వచ్చిన తర్వాత విలన్ పాత్రలకు స్వస్తి పలికిన చలపతిరావు క్రమశిక్షణ కలిగిన తండ్రిగా, సోదరుడిగా సున్నిత పాత్రల్లోనూ అద్భుత నటనను ప్రదర్శించారు. 50ఏళ్ల సినీ కెరీర్లో సుమారు 1200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన ఆయన సినిమాలపై ఆసక్తితో 22వ ఏట మద్రాస్‌కి వెళ్లారు. తొలి నుంచీ ఆయనకు రామారావు గారితో సాన్నిహిత్యం ఉండేది. అప్పట్లో రేప్ సీన్ ఉంటే చలపతిరావునే పిలిచేవారు. రావుగోపాలరావు విలన్‌గా నటించిన సినిమాల్లో రేప్ సీన్ ఉంటే.. ‘మన చలపాయ్ ఉన్నాడుగా.. ఆయనే చేస్తాడు’ అని చెప్పేవారట. చలపతిరావుకు సినిమాల్లోకి రాకముందే అంటే 19 ఏళ్లకే పెళ్లయింది. సినిమా ప్రయత్నాల కోసం మద్రాసు వెళతానంటే వాళ్లావిడ ప్రమాణం చేయించుకున్నారట. ఆడాళ్ల జోలికి వెళ్లకూడదు, మందు ముట్టుకోకూడదు, సిగరెట్ తాగకూడదు.. అని ఆమె ఒట్టు పెట్టించుకోవడంతో జీవితంలో వాటి జోలికి వెళ్లలేదు. చెన్నైలో ఎన్టీఆర్‌తోనే ఉండటంతో రోజూ రాత్రి ఏడున్నరకు తినడం, ఎనిమిదిన్నరకు పడుకోవడం అలవాటై పోయింది. ఆయన 28వ ఏటే భార్య చనిపోయింది. అప్పటికి ఆయన కొడుకు రవిబాబుకు ఆరేళ్లు, ఓ పాపకు నాలుగేళ్లు, ఇంకో పాపకు రెండేళ్లు మాత్రమే.
సినిమాలతో బిజీగా ఉండటంతో చలపతిరావుకు పిల్లలను చూసుకోవడం ఇబ్బందిగా ఉండేది. తాను మరో పెళ్లి చేసుకుంటానని, నెలనెలా డబ్బులు పంపిస్తానని.. తన పిల్లలను చూసుకోవాలని కోరినా బంధువులెవరూ ముందుకు రాలేదు. దీంతో ఆయన తన తల్లిని మద్రాస్ తీసుకెళ్లి పిల్లల బాధ్యత అప్పజెప్పారు. అప్పట్లో చలపతిరావును బయట ఎవరూ చూసినా బెదిరిపోయేవారట. ఆయన బాగా తాగుతారని, ఆడోళ్లు కనిపిస్తే రేపులు చేస్తారని బయట ప్రచారం జరిగేది. దీంతో ఎక్కడైనా ఔట్‌డోర్ షూటింగులకు వెళ్తే ఆయన ఉండే హోటల్‌లో హీరోయిన్లు బస చేసేందుకు వెనుకాడేవారట. తనకు నిజమైన రేప్ ఎలా ఉంటుందో తనకు తెలియదు కానీ.. ఉత్తుత్తి రేప్ చేయడం మాత్రం చాలా కష్టమని చెబుతారు చలపతిరావు. తనతో రేప్ సీన్‌లో యాక్ట్ చేసిన హీరోయిన్లంతా హిందీలో టాప్ పొజిషన్‌కు వెళ్లిపోయారని గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవారికి సీనియర్ల సలహాలు నచ్చడం లేదని, ఏదైనా చెప్పినా వినే పరిస్థితిలో వారు లేరని చలపతిరావు అంటున్నారు.By December 14, 2020 at 10:46PM
No comments