ఒంగోలులో యువకుడి దారుణ హత్య.. ప్రియురాలితో ఫోన్ చేయించి..
ఒంగోలులో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. పట్టపగలే నడిరోడ్డుపై యువకుడిని పొడిచి చంపేశారు దంపతులు. నగరంలో గాంధీ పార్కు వద్ద థామస్ అనే యువకుడిని అతికిరాతకంగా హత్య చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలులోని సిరికళ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న థామస్‌కి అక్కడే పనిచేస్తున్న పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం ఆమె భర్తకి తెలిసిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడి కారణంగా కాపురంలో చిచ్చురేగడంతో ఇద్దరూ కలసి ధామస్‌ని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ధామస్‌కి ఫోన్ చేసిన ప్రియురాలు గాంధీ పార్కుకి రమ్మని పిలిచింది. హడావిడిగా అక్కడికి వెళ్లిన థామస్‌ని అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రియురాలి భర్త కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. యువకుడి హత్యతో ఒంగోలులో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు పాల్పడిన దంపతులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By December 15, 2020 at 01:00PM
No comments