Breaking News

కరోనా నా ఆనందాన్ని ఆవిరి చేసింది: ‘పెళ్లి చూపులు’ హీరోయిన్


‘బాద్‌షా’ సినిమాలో కాజల్ చెల్లెలిగా నటించి ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి . ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో దుల్కర్‌ సల్మాన్‌తో చేసిన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాతో ఘనవిజయం అందుకున్న రీతూ.. ప్రస్తుతం విక్రమ్‌తో తమిళ చిత్రం ‘ధృవ నచ్చత్తిరమ్‌’, నానితో ‘టక్‌ జగదీష్‌’ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా తాను చాలా నష్టపోయానని చెబుతోంది ఈ హీరోయిన్. Also Read: ‘ఈ ఏడాది తొలి రెండు నెలలు షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిచిపోయింది. ఆ వెంటనే దుల్కర్‌తో చేసిన సినిమా సూపర్ హిట్ కావడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో 2020 సంవత్సరం నాకు మరుపురానిదిగా మిగిలిపోతుందని, ఏడాది చివరి రోజు వరకు ఈ ఆనందం కొనసాగుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను. అప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ ఈ ఏడాది విడుదల కావాల్సినవే. అయితే కరోనా దెబ్బకు ఆ సినిమాల షూటింగులన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది నాకు తీవ్ర నిరాశ మిగిల్చింది’ అని చెప్పుకొచ్చింది రీతూ వర్మ.


By December 14, 2020 at 08:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-ritu-varma-disappointed-by-corona-virus-in-2020/articleshow/79713380.cms

No comments