Breaking News

కె. రాఘవేంద్ర రావు.. బి.ఎ. సెంటిమెంట్ వెనుక అసలు కారణమిదీ.


తెలుగులో శత చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుల్లో ఒకరు. ఆయన ప్రతి చిత్రంలో పేరు చివర.. బి.ఎ. అని వేసుకోవడం గమనించే ఉంటారు. ఆయన అలా ఎందుకు పెట్టుకుంటారోనని చాలామందికి సందేహం వచ్చినా సమాధానం మాత్రం దొరికేది కాదు. అయితే తన పేరు చివరిలో బి.ఎ. అని పెట్టుకోవడం వెనుక అసలు కారణాన్ని రాఘవేంద్రరావు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. Also Read: ‘దర్శకుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘నేను డైరెక్టర్‌ కాకపోతే కచ్చితంగా డ్రైవర్‌ అయ్యేవాడిని. ఎందుకంటే నాకు అప్పట్లో ఏమీ తెలియదు. ఆ కాలంలో బి.ఎ. చదివిన వాళ్లకు ఏం ఉద్యోగం వస్తుంది? కనీసం డ్రైవర్‌కు ఇచ్చేంత జీతం కూడా ఇచ్చేవారు కాదు. దర్శకుడినయ్యాక రెండు, మూడు సినిమాలకు నా పేరు చివర బి.ఎ. అని పెట్టుకున్నా. ఆ సినిమాలు బాగా ఆడాయి. ఆ తర్వాత ఓ సినిమాలో నా పేరు చివర డిగ్రీని పెట్టలేదు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు’ ‘దీంతో దాన్ని సెంటి‌మెంట్‌గా భావించి పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్‌గారికి చెప్పాను. అది నా కోరిక కాదు. సెంటి‌మెంట్‌గా అనిపిస్తోంది. తర్వాతి సినిమాలో నా పేరు చివర బి.ఎ. అని యాడ్ చేయండి అని చెప్పడంతో ఆయన సరేనన్నారు. అప్పటి నుంచి అది సెంటిమెంట్‌గా కొనసాగుతూ వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఏమీ తెలీదు. చెక్ రాయడం రాదు, టికెట్ కొనుక్కోవడం రాదు. ప్రొడక్షన్ మేనేజర్లు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. నేను డ్రైవింగ్ బాగా చేసేవాడిని. ఒకవేళ దర్శకుడిని కాకపోయింటే డ్రైవర్ అయ్యేవాడినేమో’ అని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు రాఘవేంద్రరావు.


By December 03, 2020 at 11:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/k-raghavendra-rao-b-a-sentiment-secret/articleshow/79542753.cms

No comments