రజినీకాంత్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్, కొత్త పార్టీకి మొగ్గు
సూపర్ స్టార్ రాజకీయం అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ ముందే ఇచ్చేశారు.. రాజకీయ పార్టీపై ట్విట్టర్ వేదికంగా తలైవా క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ట్వీట్ చేశారు. జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.. డిసెంబర్ 31న పార్టీ వివరాలు ప్రకటిస్తామన్నారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. సోమవారం తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీ సమావేశమయ్యారు. రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సమావేశం తర్వాత నేరుగా తన నివాసం పోయెస్ గార్డెన్‌కు చేరుకున్న రజినీ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై వీలైనంత తర్వగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. మక్కళ మండ్రం సభ్యులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. మక్కళ మండ్రంలోని లోటుపాట్ల గురించి చర్చించినట్టు తలైవా వివరించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. ప్రకటన చేసినా క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. ఇప్పుడు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.
By December 03, 2020 at 12:49PM
No comments