సర్‌ప్రైజ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ... ‘రౌడీ’కి థ్యాంక్స్ చెప్పిన బన్నీ
తెలుగు హీరోల్లో స్టైల్ పరంగా చూస్తే ముందు వరుసలో ఉంటారు. అందుకే ఆయన్ని స్టైలిష్ స్టార్ అని పిలుస్తుంటారు. అలాంటి స్టార్‌నే మెప్పించాడు యంగ్ హీరో . ఫ్యాషన్ పట్ల తనకున్న అభిరుచిని అందరికీ పరిచయం చేసేందుకు ‘రౌడీ’ బ్రాండ్‌తో విజయ్ ఓ దుస్తుల పరిశ్రమను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూత్‌లో ఈ బ్రాండ్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఈ దుస్తులకు బన్నీ కూడా ఫిదా అయిపోయాడు. తాను విజయ్‌ని ‘రౌడీ’ బ్రాండ్ దుస్తులు అడిగానని, తనకోసం స్పెషల్‌గా కొన్ని దుస్తులు డిజైన్ చేసి పంపించాడని అల్లు అర్జున్ ఓ సందర్భంలో తెలిపారు.
తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి బన్నీ కోసం దుస్తులు పంపించారట. ఆ దుస్తుల్లో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసిన బన్నీ.. ‘ఇలాంటి అందమైన, సౌకర్యవంతమైన దుస్తులు పంపించిన నా బ్రదర్ విజయ్ దేవరకొండ, రౌడీ క్లబ్ టీమ్‌కు ధన్యవాదాలు. నాపై నువ్వు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు బ్రదర్. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. Also Read: అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న ఈ షూటింగ్‌కు అనుకోని అవాంతరం ఏర్పడింది. యూనిట్లో ఓ సభ్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో షూటింగ్‌కు పేకప్ చెప్పేశారు. మరోవైపు విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నాడు.By December 03, 2020 at 11:24AM
No comments