Breaking News

నిహారిక వెడ్డింగ్... మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో.. పిక్స్ వైరల్


మెగా బ్రదర్ నాగబాగు ముద్దుల కూతురు విహానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈరోజు(బుధవారం) రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారికకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌ దీనికి వేదిక కాబోతుంది. రెండ్రోజుల క్రితమే వధూవరులతో కలిసి ప్రత్యేక విమానాల్లో ఉదయ్‌పూర్ చేరుకున్న మెగా, అల్లు కుటుంబాలు సంగీత్, మెహందీ కార్యక్రమాల్లో సందడి చేశారు. తొలిరోజు జరిగిన సంగీత్ కార్యక్రమంలో మెగా హీరోలు డ్యాన్సులతో ఉర్రూతలూగించారు. వధువు నిహారిక కూడా పలు పాటలకు ఉత్సాహంగా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా మంగళవారం ఉదయ్‌పూర్ చేరుకున్నారు. మెహందీ ఫంక్షన్లో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు వీరిద్దరి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. పలు పాటలకు చిరంజీవి, నాగబాబుతో పాటు అతిథులు కూడా చిందులేశారు. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ అందరికంటే పొడగరి. ఇప్పుడు అకీరా అతడిని మించిపోవడంతో మెగా అభిమానులు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.


By December 09, 2020 at 07:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/power-star-pawan-kalyan-and-mega-heroes-stills-from-nihaerika-wedding/articleshow/79635497.cms

No comments