Breaking News

‘బంగారు కోడిపెట్ట’ సాంగ్‌కు మామతో కలిసి బన్నీ స్టెప్పులు.. చిరుకు షాకిచ్చిన సురేఖ


కొణిదెల నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో నిహారిక-చైతన్యల పెళ్లి జరగనుండటంతో మెగా, అల్లు కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సోమవారం జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో వధూవరులు, మెగా హీరోలు డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్లోనూ అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మెగాస్టార్‌ నటించిన ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు చిరు, బన్నీల స్టెప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే పాటకు చిరు భార్య సురేఖ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేయడం, ఆమె చూసి చిరంజీవి అవాక్కైన వీడియో కూడా వైరల్ అవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ కూడా మంగళవారం ఈ వేడుకకు జత కలవడంతో ‘ఆఖరి ఆనందం వచ్చేసిందంటూ’ నాగబాబు ఫోటో షేర్ చేశారు. మెహందీ ఫంక్షన్లో మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి నిహారిక పెళ్లి మెగా, అల్లు కుటుంబాన్ని ఫుల్ జోష్ నింపుతోంది.


By December 09, 2020 at 08:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-dance-with-allu-arjun-in-niharika-wedding/articleshow/79635673.cms

No comments