Breaking News

భారత్ బంద్ ప్రభావం: ఈ సేవలు యథాతధం.. అటువంటి సర్వీసులకు అంతరాయం


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు చేపట్టిన కొనసాగుతోంది. రైతులిచ్చిన భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, వ్యాపార, విద్యార్ధి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో బంద్ విజయవంతంగా జరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బంద్ కొనసాగుతున్నా.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే రహదార్లను నిర్బంధిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కార్యాలయాలకు వెళ్లేవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. అత్యవసర, నిత్యావసర వాహనాలకు ఆటంకం కలిగించబోమని, మూడు గంటల కంటే ఎక్కువ సేపు చిక్కుకున్న వారికి పండ్లు, పాలు అందజేయనున్నట్టు రైతులు ప్రకటించారు. భారత్ బంద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాలు భారత్ బంద్‌కు సంఘీభావం తెలిపినా.. అందులో పాల్గొనడం లేదు. కాబట్టి బ్యాంకు సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అఖిల భారత రవాణాదారుల సంక్షేమ సంఘం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదు. అలాగే, వాణిజ్య సంఘం సీఏఐటీతో కలిసి దీనిపై సంయుక్త ప్రకటన చేసింది. రవాణ, వాణిజ్య సంఘాలు పాల్గొనడం లేదని పేర్కొన్నారు. బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు యథావిధగా సాగుతున్నాయి. ఢిల్లీలో మెట్రో సహా ప్రజా రవాణా, మార్కెట్లు కొనసాగుతున్నాయి. అత్యవసర సేవలు, అంబులెన్స్‌లు, ఆస్పత్రులపై ఉండదని రైతులు ప్రకటించారు. అలాగే, వివాహ కార్యక్రమాలను కూడా అడ్డుకోబోమని స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణాలో రవాణా యూనియన్లు సంపూర్ణ మద్దతు తెలిపి, భారత్‌ బంద్‌లో పాల్గొంటున్నాయి. అక్కడ పాలు, కూరగాయల రవాణా కూడా నిలిచిపోయింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని మండీలు మూసివేశారు. ఢిల్లీ ఆజాద్ మండీ కూడా మూతపడింది. పంజాబ్‌లో హోటల్, రెస్టారెంట్ సంఘాలు కూడా బంద్‌లో పాల్గొనడంతో అన్నీ మూతబడ్డాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉబర్, ఓలా సేవలు కూడా నిలిచిపోయాయి.


By December 08, 2020 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/what-will-remain-open-and-what-will-be-closed-other-details-during-bharat-bandh-today/articleshow/79619601.cms

No comments