అతి త్వరలో మెగా వారింట మరో పెళ్లి వేడుక! సీక్రెట్ బయటపెట్టిన సాయి ధరమ్ తేజ్
ఇటీవలే మెగా కుటుంబంలో మోగిన పెళ్లి బాజాల తాలూకు విషయాలు నేటికీ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9వ తేదీన నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిపించారు. మెగా అతిథుల మధ్య ఉదయ్‌పూర్ ప్యాలస్‌లో జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడింది నిహారిక. ఈ పెళ్లి సందడిలో మెగా కాంపౌండ్ హీరోలంతా ఒక్కచోట చేరి ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో మెగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఇంతలో తాజాగా మెగా మేనల్లుడు తమ ఫ్యామిలీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం చెప్పి ఆ ఆనందాన్ని రెట్టింపు చేశారు. తన లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్' ప్రమోషన్‌లో భాగంగా మెగా పెళ్లిళ్లపై సాయి ధరమ్ తేజ్ ఓపెన్ అయ్యారు. మెగా కాంపౌండ్‌లో పెళ్లికాని యంగ్ హీరోలు ఇక ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే ఈ లిస్టులో ముందు వరుసలో అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఉన్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడని అన్నారు. శిరీష్ తనకంటే పెద్దవాడని చెప్పిన సాయి ధరమ్ తేజ్.. వచ్చే ఏడాది ఆయన పెళ్లి జరగవచ్చని తెలిపారు. తన పెళ్లికి మాత్రం ఇంకా సమయం ఉందని, ప్రస్తుతం తనపై ఉన్న బాధ్యతలు తీరాక పెళ్లి చేసుకుంటానని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ మాటలను బట్టి చూస్తే అల్లు అరవింద్ అతి త్వరలో శిరీష్ డేట్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే అరవింద్, తనకు కాబోయే కోడలిని సెలక్ట్ చేశారా? లేక పెళ్లి కూతురును వెతికే పనిలో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా మెగా కాంపౌండ్‌లో మరో పెళ్లి వేడుక జరగనుందనే వార్త అభిమానులను హుషారెత్తిస్తోంది. Also Read: ఇక సాయి ధరమ్ తేజ్ 'సోలో బతుకే సో బెటర్' సినిమా విషయానికొస్తే.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందిన ఈ 'సోలో బతుకే సో బెటర్' సినిమాకు నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించాడు. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 25వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది.
By December 17, 2020 at 11:54AM
No comments