సుమంత్‌ను ఏఎన్నార్ ఎందుకు దత్తత తీసుకున్నారు?.. ఇదీ అసలు కథ
అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోగా అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు సుమంత్. అయితే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం ఆ క్రేజ్‌ని కాపాడుకోలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావుకు అంటే ఎంతో ప్రేమ. తాత దత్తత తీసుకోవడంతో చిన్నప్పటి నుంచి ఏఎన్నార్ వద్దే సుమంత్ పెరిగారు. అయితే ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నప్పటికీ మనవడైన సుమంత్‌ను ఆయన ఎందుకు దత్తత తీసుకున్నారో చాలా మంది తెలియదు.
హీరోగా బిజీగా ఉన్న సమయంలో ఏఎన్నార్ ఏడాదికి ఆరేడు సినిమాలు చేసేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్ వల్ల పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించలేకపోతున్నానే అని బాధపడేవారు. ‘అందాల రాముడు’ సినిమా షూటింగ్ సమయంలో నాగేశ్వరరావుకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఏడాది పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో సమంత్ జన్మించాడు. తాత వద్దే ఆడుకోవడం, ఇంట్లో సందడిగా పాకడంతో ఏఎన్నార్‌కు సుమంత్‌పై ప్రేమ పెరిగింది. ఎలాగూ సినిమాలు చేస్తూ తాను తండ్రి మమకారాన్ని పొందని కారణంగా సుమంత్‌ని పెంచుకుని ఆ విధంగానైనా ఆ అనుభూతి అందుకోవాలని భావించారు. వెంటనే అమెరికాలో ఉన్న సుమంత్ తల్లిదండ్రులకు లెటర్ రాసారు. అందుకు సుమంత్ తల్లిదండ్రులు అంగీకరించడంతో , ఆయన భార్య అన్నపూర్ణ సంప్రదాయం ప్రకారం మనవడిని దత్తత తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి సుమంత్ తాత, అమ్మమ్మ వద్దే పెరిగాడు. సుమంత్ చిన్నప్పుడు తాతతో కలిసి షూటింగ్‌లకు వెళ్లేవాడు. అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు బాగా ఎంజాయ్ చేసేవారట. సుమంత్ తన తాతయ్య నాగేశ్వరరావుని బాగా ఇమిటేట్ చేసేవాడు. ‘ప్రేమాభిషేకం’ సినిమాలో ‘వందనం’ పాటకు గ్లాసు పట్టుకొని మరీ తన తాతయ్యను ఇమిటేట్ చేసేవాడినని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’లో ఏఎన్నార్ పాత్రలో సుమంత్ మెరిసిన సంగతి తెలిసిందే. By December 17, 2020 at 11:27AM
No comments