Breaking News

‘F3’ షురూ.. వెంకీ లేకుండానే మొదలుపెట్టిన వరుణ్


విక్టరీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘F2’. ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సంక్రాంతికి అల్లుళ్లుగా వచ్చిన వెంకీ, వరుణ్ భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీసు కొల్లగొట్టారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘F3’ను రూపొందిస్తామని అప్పుడే చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించారు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ‘F3’ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాను హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సీక్వెల్‌కు కూడా అనిల్ రావిపూడే దర్శకుడు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు స‌మ‌ర్పణ‌లో శిరీష్ నిర్మిస్తున్నారు. ‘F2’లో అలరించిన వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ ఈ సీక్వెల్‌లోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, చిత్ర ప్రారంభోత్సవంలో వెంకటేష్ పాల్గొనలేదు. ప్రస్తుతం ఆయన ‘నారప్ప’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కుదరలేదు. అలాగే, మెహ్రీన్ కూడా హాజరవ్వలేదు. వరుణ్ తేజ్, తమన్నాలపై చిత్రీకరించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ క్లాప్ కొట్టగా, ఫైనాన్సియ‌ర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత దిల్‌ రాజు గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. Also Read: ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు దిల్‌ రాజు, శిరీష్ మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో 2019 సంక్రాంతికి విడుదలైన ‘F2’ నవ్వుల జల్లులో ప్రేక్షకులను ముంచెత్తి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే సీక్వెల్‌గా ‘F3’ సినిమాను రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటి నుండి డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘F3’ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ‘F2’ ప్రేక్షకులను ఎలా నవ్వించిందో.. దానికి మరింత వినోదం జతచేసి ‘F3’ కథను సిద్ధం చేశారు. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్‌ల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేయడానికి రాబోతుంది. డిసెంబ‌ర్ 23 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం’’ అని అన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ కాంబినేష‌న్‌ను వెంక‌టేష్-త‌మ‌న్నా, వ‌రుణ్‌ తేజ్‌-మెహ్రీన్ జోడీల కాంబినేష‌న్‌తో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మార్చి తెరకెక్కించిన ‘F2’ బ్లాక్‌బ‌స్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మోర్ ఫ‌న్‌ను యాడ్ చేసి ‘F3’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అద్భుత‌మైన క‌థ కుదిరింది. మ‌రోసారి వెంకటేష్, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ మిమ్మల్ని న‌వ్వుల్లో ముంచెత్తుతారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం ఎంతో హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. Also Read: కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎస్.కృష్ణ రచనా సహకారం అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. తమ్మిరాజు ఎడిటర్. ఆదినారాయణ, నారా ప్రవీణ్ అడిషనల్ స్క్రీన్‌ప్లే అందించారు.


By December 17, 2020 at 03:18PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/venkatesh-varun-tej-tamannaah-mehreen-starrer-f3-movie-launched/articleshow/79777186.cms

No comments