Breaking News

శాసనమండలిలో రభస.. ఛైర్మన్‌కు అవమానం


ర్ణాటక శాసనమండలి రసాభాసాగా మారింది. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు బాహాబాహీకి దిగారు. మండలి ఛైర్మన్‌ స్థానాన్ని అవమానించే రీతిలో ప్రవర్తించారు. ఐదు రోజుల వాయిదా అనంతరం శాసనమండలి మంగళవారమే (డిసెంబర్ 15) తిరిగి ప్రారంభమైంది. మండలి ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ ‌ధర్మగౌడను కుర్చీలో నుంచి లాగేశారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఘర్షణకు దారి తీసింది. సభలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఛైర్మన్‌ను ఆ స్థానంలో అక్రమంగా కూర్చొబెట్టాయని ధ్వజమెత్తారు. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శాసనమండలిలో గోవధ నిషేధ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావించింది. ఈలోగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ట్విటర్ వీడియో: రాసాభాస కొంత మంది సభ్యులు గుండాల్లా ప్రవర్తించారని బీజేపీ ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా మండిపడ్డారు. మండలి వైస్ ఛైర్మన్‌ను కుర్చీలో నుంచి లాగేశారని తెలిపారు. ‘మండలి చరిత్రలో ఇలా సిగ్గుతో తల దించుకోవాల్సిన చర్య ఎప్పుడూ చూడలేదు. ఈ ఘటన పట్ల మేం చాలా సిగ్గుపడుతున్నాం. ప్రజలు ఏమనుకుంటారు అనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అని ఆయన అన్నారు. Also Read: Must Read:


By December 15, 2020 at 01:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-mlcs-in-karnataka-assembly-forcefully-remove-the-chairman-of-the-legislative-council/articleshow/79736441.cms

No comments