Breaking News

దిల్‌ రాజు బర్త్‌డే పార్టీ... సందడి చేసిన స్టార్లు


తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న 50వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆయన కుటుంబసభ్యులు బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చిన పార్టీకి ప్రముఖులు హాజరై సందడి చేశారు. దిల్‌ రాజు రెండో భార్య ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా మారారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, రామ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరోయిన్లు రాశీఖన్నా, పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్. నివేదా పేతురాజ్ తదితరులు పార్టీలో సందడి చేశారు. ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


By December 18, 2020 at 09:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-celebrities-attends-in-producer-dil-raju-bithday-function/articleshow/79790238.cms

No comments