ప్రేమ నాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది: మీరా నందన్


ప్రేమలో పడితే జీవితం బాగుంటుందని చెబుతుంటారని.. కానీ తాను మాత్రం ప్రేమలో పడి కష్టాల పాలయ్యానని వెల్లడించింది ప్రముఖ నటి మీరానందన్. తమిళంలో ‘వాల్మీకి’, ‘అయ్యనార్’, ‘చండమారుతమ్’, ‘సూర్యనగరం’ తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. రెండేళ్ల క్రితం వచ్చిన ‘గోల్డ్ కాయ్’ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం దుబాయిలో ఉంటున్న మీరానందన్ ఇటీవల హాట్ ఫోటోషూట్‌తో అందరికీ షాకిచ్చింది. శృంగార భరితమైన భంగిమల్లో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. Also Read: తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన మీరా.. దుస్తులను బట్టి ఒకరి క్యారెక్టర్‌ను అంచనా వేసే అధికారం ఎవరికీ లేదని, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలన్నది తన ఇష్టమని చెప్పుకొచ్చింది. తాను చిన్న వయసులోనే ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని, ప్రేమలో పడి కష్టాల పాలయ్యానని చెప్పింది. చివరకు తనను తాను ప్రేమించడం నేర్చుకున్నానని, ఇప్పుడు తనకు కుటుంబమే ముఖ్యమని వేదాంత ధోరణితో సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. Also Read:
By December 07, 2020 at 08:13AM
No comments